కర్నాటకలోని బెళగావి వెళ్లిన వాళ్లు కుందా స్వీట్ తెచ్చుకోకుండా వెనక్కిరారని నానుడి. అంత అద్భుతమైన స్వీట్ తయారీ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే..
ఒకప్పుడు రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీ అతను బెల్గాంలో స్వీట్ షాప్ పెట్టాడు. అతడో ఓ రోజు పాలు కాస్తూ స్టవ్ ఆర్పడం మర్చిపోయి బయటకు వెళ్లిపోయాడు. రెండు గంటల తర్వాత వచ్చి చూస్తే పాలు బాగా మరిగి సగం అయిపోయాయి. వాటిని రుచి చూస్తే అతడికి స్వీట్ తిన్నట్టే అనిపించిందట. ఆ పాలలో కాస్త కోవా వేసి మరిగించగానే దాని రుచి రెట్టింపైంది. ఆ రుచికి ఫిదా అయిన అతడు.. వెంటనే దానికి 'కుంద' అని పేరుపెట్టాడు. బెల్గాంలో తయారైంది కాబట్టి బెల్గాం కుందగా మారింది. దీన్ని మనమూ తయారుచేసుకుని మధురమైన ఆ రుచిని ఆస్వాదించవచ్చు.
కావాల్సినవి:
- చిక్కని పాలు- రెండు లీటర్లు
- పెరుగు- అరకప్పు
- పంచదార- కప్పు
- యాలకులపొడి- పావు టీస్పూన్
- జీడిపప్పు, బాదాం- పావు కప్పు