చేపల పులుసు(fish pulusu telangana style) చేయడం చాలా సాధారణం. కానీ దాని లేత బెండకాయలు జోడిస్తే ఆ రుచే వేరు. ఇంతకీ దాని తయారీ విధానం ఎలా? ఏమేం కావాలి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. వెంటనే వంట చేసేయండి.
కావాల్సిన పదార్థాలు
చేపముక్కలు, నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువా, ఉల్లిపాయ పేస్ట్, టమాటా ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు, లేత బెండకాయాలు, కొత్తిమీర
తయారీ విధానం
ముందుగా పొయ్యిపై మట్టిపాత్ర పెట్టి అందులో కొంచెం ఎక్కువగా నూనెను వేడిచేయాలి. అందులో కాస్త ఉప్పు వేసి చేప ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టాలి. అదే పాత్రలో ఉన్న నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసిక చిటపడలాడించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్, దాంతో పాటు పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే ఇంగువా, దానితో పాటు అల్లంవెల్లులి పేస్ట్, కారంపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, టమాటా ప్యూరీ, బెండకాయలు వేసిన ఆ మిశ్రమాన్ని బాగా ఉడకనివ్వాలి.
ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అందులో తరిగిన పచ్చిమిర్చి, చింతపండు పులుసు, తగినంత ఉప్పు వేసి మరో 10 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి. బెండకాయ ముక్కలు సాఫ్ట్‌గా మారిన తర్వాత ఫ్రై చేసిన చేప ముక్కల్ని వేయాలి. చివరగా కొత్తమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి. ఎంతో రుచికరమైన 'లేత బెండకాయల చేపల పులుసు' రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సరి.
ఇవీ చదవండి: