తెలంగాణ

telangana

ETV Bharat / priya

యమ్మీ ' ఎగ్ బోట్స్'.. సింపుల్ రెసిపీ!

రోజుకో గుడ్డు తినండి.. ఆసుపత్రికి దూరంగా ఉండండి అని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అందుకే చాలా మంది .. రోజూ ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డు తింటారు. కానీ, గుడ్డు వంటకాలు అనగానే ఆమ్లెట్, ఎగ్ బోండా వంటివే గుర్తొస్తాయి. ఇవి కాకుండా ఇంకాస్త వెరైటీగా ఉండే ఎగ్ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే, 'ఎగ్ బోట్స్' ట్రై చేయాల్సిందే..

learn-yummy-egg-boats-recipe-in-telugu
యమ్మీ ' ఎగ్ బోట్స్'.. సింపుల్ రెసిపీ!

By

Published : Jul 28, 2020, 1:00 PM IST

రెస్టారెంట్లలో ఎంతో ఫేమస్ అయిన ఎగ్ బోట్స్ రెసిపీని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు..

కావలసినవి ఇవే..

  • బిగేట్ బ్రెడ్స్(ఫ్రెంచ్ బ్రెడ్స్) -2
  • గుడ్లు -4
  • ఉడికించిన చికెన్ కీమా - పావు కప్పు
  • ఉల్లి కాడలు -2
  • క్రీమ్ -2 టేబుల్ స్పూన్లు
  • పార్మేసన్ ఛీజ్ - అర కప్పు
  • చెద్దార్ ఛీజ్ -పావు కప్పు
  • ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా

తయారీ...

  • ముందుగా బ్రెడ్ మధ్యభాగాన్ని తొలగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చూడటానికి బోట్ లా కనిపిస్తాయి. ఇప్పుడు ఉల్లి కాడల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  • గుడ్లు పగులగొట్టి ఓ గిన్నెలో వేసుకుని బీట్ చేయాలి. ఇందులో తరిగిన ఉల్లికాడలు, 2 రకాల ఛీజ్, క్రీమ్, ఉడికించిన చికెన్ కీమా, ఉప్పు, మిరియాల పొడి... ఇలా అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బగేట్ బ్రెడ్​ల మధ్యభాగంలో ఈ గుడ్డు మిశ్రమాన్ని నింపాలి. ఆలా నింపిన బ్రెడ్ ముక్కల్ని ఒవెన్ లో 180 డిగ్రీల వద్ద 15 నుంచి, 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
  • ఉడికిన తర్వాత బయటకు తీసి కాసేపు చల్లారనివ్వాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఎగ్ బోట్స్ సిద్ధం. ఎంతో సింపుల్ గా ఉంది కదూ?

ఇదీ చదవండి:'గోధుమ పిండి కేక్' రుచి చూస్తే అవాక్కే!

ABOUT THE AUTHOR

...view details