తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఆరు పదార్థాలతో అదిరిపోయే 'కోవా సమోసా' రెసిపీ! - samosa recipes

ఉల్లి సమోసా, ఆలూ సమోసా, చికెన్​ సమోసా.. ఇలా రకరకాల సమోసాలు రుచి చూసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా కోవా సమోసా టేస్ట్​ చేశారా? అవునండీ.. పాలకోవా అంటే స్వీట్లే చేసుకోవాలా... అప్పుడప్పుడూ ఇలా సమోసాలూ ట్రై చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే 'కోవా సమోసా' రెసిపీపై ఓ లుక్కేయండి.

learn-milkmaid-slash-kova-samosa-simple-recipe-in-telugu
ఆరు పదార్థాలతో అదిరిపోయే 'కోవా సమోసా' రెసిపీ!

By

Published : Jul 13, 2020, 1:01 PM IST

పాల కోవాతో సమోసా చేసుకుని తిన్నారంటే ఇక వదల్లేరు. పాలలోని పోషకాలతో నిండిన 'కోవా సమోసా'ను.. కేవలం ఆరు పదార్థాలతో ఇంట్లోనే చేసుకోవచ్చు..

ఆరు పదార్థాలతో అదిరిపోయే 'కోవా సమోసా' రెసిపీ!

కావలసినవి ఇవే...

  • మైదా: పావుకిలో
  • ఉప్పు: చిటికెడు
  • నూనె: వేయించడానికి సరిపడా
  • తీపి కోవా: కప్పు
  • జీడిపప్పు: పావుకప్పు
  • యాలకులు: ఒకటి

తయారుచేసే విధానం..

మైదాలో మూడు టేబుల్‌స్పూన్ల నూనె, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి దానిమీద తడిబట్ట వేసి అరగంటసేపు ఉంచాలి. విడిగా ఓ గిన్నెలో కోవా, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి ఉంచాలి. మైదా పిండిని చిన్నముద్దల్లా చేసి పుల్కాల్లా వత్తాలి. ఒక్కో పుల్కానీ సగానికి కోసి త్రికోణాకారంలో మడిచి కోవా మిశ్రమాన్ని పెట్టి అతికించి కాగిన నూనెలో వేయించి తీయాలి. అంతే, ఎంతో రుచికరమైన కోవా సమోసా రెడీ.

ఇదీ చదవండి: హెల్దీ 'కొర్రల సలాడ్‌' సింపుల్​ రెసిపీ!

ABOUT THE AUTHOR

...view details