నువ్వుల జొన్నె రొట్టెలు తిని ఆరోగ్యాన్ని పెంచుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ జొన్న పిండి.. చపాతీ పిండిలా సాగదు. అయితే దానిని ఓ టెక్నిక్‌తో చెయ్యాలి. మరి ఆ టెక్నిక్ తెలియనివారు ఇలా ఫాలో అయిపోండి.
నువ్వుల జొన్న రొట్టెతో ఆరోగ్యం గట్టిగుంటది! కావాల్సినవి
జొన్న పిండి - ఒకటింపావు కప్పు
వేడి నీళ్లు - పిండి కలుపుకోవడానికి సరిపడా
నువ్వులు - 2-3 టేబుల్‌స్పూన్లు
ఉప్పు - చిటికెడు
తయారీ
ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో కప్పు జొన్న పిండి, నువ్వులు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆపై వేడి నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ జొన్న పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కాసేపు నాననివ్వాలి. ఆపై వీటిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పొడి జొన్నపిండిని చపాతీ పీటపై చల్లుకొని జొన్న పిండి ముద్దను చపాతీలా ఒత్తుకోవాలి. ఈ రోటీల్ని చేత్తో లేదంటే చపాతీ కర్రతో చేసుకోవచ్చు. ఇప్పుడు స్టౌ మీద పెనం పెట్టి.. అది కాస్త వేడయ్యాక జొన్న రొట్టెను దానిపై వేసి నీళ్లలో ముంచిన కాటన్ క్లాత్‌తో రొట్టెపై అద్దుతూ ఇరువైపులా కాల్చుకోవాలి. ఇలా ఒక్కో రొట్టెను ఎప్పటికప్పుడు చేస్తూ కాల్చుకోవాలి. తద్వారా ఆ రొట్టెలు గట్టిపడకుండా రుచిగా వస్తాయి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో భోగి రోజున ఎక్కువగా చేసుకునే ఈ రొట్టెల్ని ఏ కూరతో తిన్నా వాటి రుచికి ఫిదా అవ్వాల్సిందే!
ఇదీ చదవండి: ఆలూ-పాలక్‌తో కొత్తగా.. నోరూరించేలా!