తెలంగాణ

telangana

ETV Bharat / priya

'చిరు ధాన్యాల లడ్డు'తో ఆరోగ్యం అదుర్స్!

లడ్డూను చూడగానే నోరూరిపోతుంది. కానీ, తీపి తింటే బరువు పెరిగిపోతామని ఎంత మనసు లాగినా.. లడ్డూను మనస్ఫూర్తిగా తినలేకపోతాం. మరి, తినే కొద్దీ ఆరోగ్యాన్నిచ్చే లడ్డూలుంటే ఎంత బావుంటుంది? ఇంకెందుకు ఆలస్యం.. సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే చిరు ధాన్యాల లడ్డూ చేసుకోండిలా.

learn-how-to-make-health-millets-laddu-at-home-full-recipe
'చిరు ధాన్యాల లడ్డు'తో ఆరోగ్యం అదుర్స్!

By

Published : Aug 3, 2020, 1:00 PM IST

మిల్లెట్స్.. అదేనండీ చిరుధాన్యాలు. ఇప్పుడు బరువు తగ్గడానికి అన్నం బదులు మిల్లెట్స్ తినమంటున్నారు వైద్యులు. కానీ, వాటిని వండుకోవడం అలవాటే లేని మనకు వాటి రుచి పెద్దగా నచ్చదు. కానీ, మిల్లెట్స్ తో ఇలా లడ్డూ చేసుకుంటే తినకుండా ఉంటారా?

కావాల్సినవి

కొర్రలు - మూడు టేబుల్‌స్పూన్లు

రాగులు - మూడు టేబుల్‌స్పూన్లు

సజ్జలు - మూడు టేబుల్‌స్పూన్లు

అరికలు - మూడు టేబుల్‌స్పూన్లు

సామలు - మూడు టేబుల్‌స్పూన్లు

పెసరపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు

బార్లీ - టేబుల్‌స్పూన్

తురిమిన బెల్లం - ముప్పావు కప్పు

యాలకుల పొడి - టేబుల్‌స్పూన్‌

నెయ్యి - 6 టేబుల్‌స్పూన్లు

జీడిపప్పులు - 10

తయారీ

ముందుగా స్టౌపై ఒక ప్యాన్‌ పెట్టి.. అందులో నెయ్యి వేడిచేసి జీడిపప్పును దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్‌లో కొర్రలు, రాగులు, సజ్జలు, అరికలు, సామలు, పెసరపప్పు, బార్లీలను ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయించుకొని చల్లార్చుకోవాలి. ఆపై వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దీనిలో తురిమిన బెల్లం కూడా వేసి మళ్లీ గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని.. వేయించిన జీడిపప్పు, కరిగించిన నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అరచేతులకు నెయ్యి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చేసుకోవాలి. ఇలా తయారైన లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 2-3 వారాల పాటు పాడవకుండా ఉంటాయి.

ఇదీ చదవండి: శ్రావణం స్పెషల్ 'నువ్వుల పులిహోర' రెసిపీ!

ABOUT THE AUTHOR

...view details