తెలంగాణ

telangana

ETV Bharat / priya

'జంగ్లీ చికెన్'.. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ! - chicken curry video

'జంగ్లీ చికెన్'.. ఈ పేరు వినడానికి ఫన్నీగా ఉన్నా.. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది! ఇంతకీ దీని తయారీ ఎలా? ఇది ఎక్కడ ఫేమస్?

Junglee chicken curry recipe telugu
జంగ్లీ చికెన్ రెసిపీ

By

Published : Aug 25, 2021, 9:36 AM IST

చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ తందూరి, చికెన్ కబాబ్.. ఇలా చికెన్​తో చాలా రకాల వంటకాలు ప్రయత్నించి ఉంటారు. అయితే రాజస్థానీ స్టైల్లో చికెన్​తో సరికొత్తగా 'జంగ్లీ చికెన్' ట్రై చేసి చూడండి. చాలా సులువుగా, తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు.

కావాలిసిన పదార్థాలు

చికెన్ పావు కిలో, నెయ్యి, చిన్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, హోల్ గరమ్​ మసాలా, వెల్లులి అర కప్పు, ఉప్పు, కారం, ధనియాలు

తయారీ విధానం

స్టవ్​ వెలిగించి, పాన్ పెట్టి అందులో నూనె పోసి కాగనివ్వాలి. అందులో హోల్ గరమ్ మసాలా, ఆ తర్వాత చికెన్​ వేసి కాస్త ఫ్రై చేయాలి. చికెన్ మగ్గిన కాసేపటి తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలను వేసి కలపాలి. అందులోనే ఉప్పు, కారం తగినంత వేసి బాగా కలిపి మూతపెట్టాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత, చివర్లో ధనియాలు వేసి, పాత్రలో జంగ్లీ చికెన్ సర్వ్​ చేసుకుంటే సరి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details