తెలంగాణ

telangana

ETV Bharat / priya

అవునండీ.. చేప గుజ్జుతో చేసిన కేకులివి! - జపాన్‌ తెల్ల చేప సురిమి కేకులు

ఫొటోల్లోని కేకులను చూస్తే తినేయాలనిపిస్తోంది కదూ..? మృదువుగా, క్రీమ్‌తో ఆకర్షణీయమైన ఆకారాల్లో ఉన్న వాటిని చూస్తే ఎవరికైనా నోరూరుతుంది మరి అంటారా.? అయితే ఇక్కడ కనిపిస్తున్న వీటికో ప్రత్యేకత ఉంది. ఈ కేకులను చేప గుజ్జుతో తయారుచేస్తారు.

japan cakes
జపాన్‌ చేప కేకులివి!

By

Published : Jul 17, 2021, 12:31 PM IST

కమాబొకొ అనేది ఒకరకమైన జపాన్‌ కేకు. దీన్ని ఆ దేశంలో దొరికే తెల్ల చేప 'సురిమి' గుజ్జుతో తయారుచేస్తారు. ఈ కేకు తయారీలో చేప గుజ్జుతోపాటు గుడ్డులోని తెల్లసొన, చక్కెర, ఉప్పు, జపనీస్‌ రైస్‌ వైన్‌, పిండినీ వాడతారు. దాంతో కేకు ఎంతో మృదువుగా, రసగుల్లాలా ఉంటుంది. దీని తయారీలో ఎలాంటి రంగులు, ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించరు. అయితే వీటిని మనం తినే కేకుల్లా కాకుండా వేడి వేడి సూపులతోనో, సాసుల్లో నంజుకునో తింటారు. సాధారణంగా 'కమాబొకొ' అనే ఈ కేకు స్థూపాకారంలో దొరుకుతుంది. కొన్నిచోట్ల మాత్రం రకరకాల ఆకారాల్లోనూ తయారుచేస్తారు.

జపాన్‌ చేప కేకులు
జపాన్‌ చేప కేకులు
జపాన్‌ చేప కేకులు
జపాన్‌ చేప కేకులు

ఈ కేకులను కేవలం బేక్‌ చేయడమే కాదు ఆవిరి మీద ఉడికించి, డీప్‌ ఫ్రై చేసి కూడా తయారుచేస్తారు. ఎరుపు, తెలుపు కమాబొకోలను ప్రత్యేకమైన రోజులు, వేడుకల్లో తప్పనిసరిగా సర్వ్‌ చేస్తారు. ఈ రెండు రంగులు మంచి చేస్తాయని జపనీయుల నమ్మకం. పద్నాలుగో శతాబ్దం నుంచే వాడుకలో ఉన్నా ఇవి ప్రస్తుతం ప్రపంచం మొత్తం విస్తరించాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details