How to Make Instant Idli in Telugu :చాలా మంది ఇళ్లలో ఉదయం టిఫెన్‌గా ఇడ్లీ ఉంటుంది. టేస్ట్‌తోపాటు తేలిగ్గా అరుగుతూ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో.. ఎక్కువ మంది అల్పాహారంగా ఇడ్లీని తీసుకుంటుంటారు. అయితే.. వీటిని ఇంట్లో తయారు చేసుకోవాలంటే కాస్త ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ టిఫిన్ కోసం ముందు రోజు రాత్రి మినపపప్పు నానబెట్టుకొని.. నెక్ట్ డే రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీలు తయారు చేసుకోవాలి. ఇదంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్.
అయితే చాలా మందికి తెలియని విషయమేంటంటే.. అంత సమయం వెయిట్ చేయకుండానే అప్పటికప్పుడు ఇడ్లీలు(Idlis)తయారు చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు.. వేడివేడిగా మెత్తటి ఇడ్లీలను వండుకోవచ్చు. మరి.. ఈ ఇన్‌స్టంట్ ఇడ్లీలు చేసుకోవడం ఎలాగో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇన్‌స్టంట్ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడం ఎలాగంటే..?
మీరు అప్పటికప్పుడు ఇడ్లీ చేసుకోవాలంటే.. ముందుగా ఇడ్లీ పొడిని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం మినప్పప్పు, అటుకులు, ఇడ్లీ రవ్వ అవసరం. ఇప్పుడు ముందుగా అటుకులను పొడిలా చేసి ఒక డబ్బాలో దాచుకోవాలి. అలాగే మినపపప్పును తీసుకొని దానిని స్టవ్‌పై రెండు నిమిషాలు వేయించాలి. ఈ పప్పులోనే కొన్ని మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. అప్పుడు అవి చల్లారాక.. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆ పిండిని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇడ్లీ రవ్వను కూడా తెచ్చి పెట్టుకోవాలి.
DON'T SKIP BREAKFAST: టిఫిన్ మానేస్తున్నారా... అయితే ఇవి తప్పవు!!
ఇప్పుడు మీరు ఇన్‌స్టంట్ ఇడ్లీలు చేసుకునే ముందు.. ఒక గిన్నెలో ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ, పట్టి పెట్టుకున్న మినప పిండి అర గ్లాసు, అటుకుల పొడి అర గ్లాసు వేసి అన్నింటినీ కలుపుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత వాటర్ పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పుల్లటి పెరుగును కూడా యాడ్ చేసుకుంటే ఇడ్లీలు రుచిగా వస్తాయి. నిజానికి పిండి పులిస్తేనే ఇడ్లీ రుచిగా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న పిండి పులియలేదు కాబట్టి.. అందుకోసం పులిసిన పెరుగును వేసుకోవాలి.
ఇలా అన్నీ యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో పిండిని వేసుకొని.. ఆవిరి మీద ఉడికిస్తే మెత్తటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. దీనిలో కొంతమంది వంటసోడా కూడా వేసుకుంటారు. ఇడ్లీలు మెత్తగా ఉంటాయని అలా చేస్తారు. అయితే.. పులిసిన పెరుగు వేస్తే ఇడ్లీలు మెత్తగానే వస్తాయి. ఇంకా.. మెత్తగా కావాలనుకుంటేనే పైన తయారుచేసుకున్న మిశ్రమంలో కాస్త వంట సోడా వేసుకోవచ్చు. ఇలా.. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలు ఈజీగా తయారుచేసుకోవచ్చు. ముందు రోజే ప్రత్యేకంగా పప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మరిచిపోతే.. నానబెట్టడం మరిచిపోయామని పొద్దున్నే బాధపడాల్సిన పరిస్థితి కూడా రాదు.
ఇడ్లీలు బాగా పొంగాలంటే ఇలా చేయండి!
వెజిటేరియన్స్‌కి స్పెషల్.. ఈ బంగాళాదుంప రైస్