తెలంగాణ

telangana

ETV Bharat / priya

Jonna Dosa: జొన్న దోశను నిమిషాల్లో చేసుకోండిలా! - జొన్న దోశ తయారీ విధానం

మనం ఇష్టపడి తినే అల్పహారంలో దోశ కచ్చితంగా ఉంటుంది. అయితే ఉల్లి, మసాలా, ఉప్మా, రవ్వ దోశ ఎప్పుడూ చేసుకునేవే. ఈ సారి జొన్న దోశ రుచి చూడండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం.దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే..

Jonna Dosa
జొన్న దోశ

By

Published : Oct 2, 2021, 7:23 AM IST

ఎప్పుడూ ఒకేలా దోశలు తిని బోర్ కొట్టేసిందా? ఓ సారి జొన్న దోశను(Jonna Dosa) ట్రై చేయండి. మంచి రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీర బరువును(Jowar Dosa for Weight Loss) నియంత్రించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. తక్కువ సమయంలోనే దీన్ని తయారుచేసుకోవచ్చు. మరి టేస్టీగా ఉండే ఇన్​స్టెంట్​ జొన్న దోశ ఎలా తయారుచేసుకోవాలో చూసేద్దామా..


కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, జొన్న పిండి, నూనె, కరివేపాకు, పింక్ సాల్ట్, అల్లం తురుము, బియ్యం పిండి, మజ్జిగ, కొత్తిమీర

తయారీ విధానం..

ముందుగా మిక్సీజార్​లో కొద్దిగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం తురుము, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పింక్​ సాల్ట్​ వేసి మిక్సీ పట్టించుకోవాలి.

మళ్లీ కొంచెం మజ్జిగ పోసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక బౌల్​లో జొన్న పిండి 2 స్పూన్లు, 1 స్పూన్​ బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు వేసి చేతితో బాగా కలుపుకోవాలి. దీనికి మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని కూడ వేసి కలపాలి.

ఈ మిశ్రమంతో వేడి ప్యాన్​ మీద దోశ వేసుకోవాలి. దానిపై క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి ఇరువైపులా కాల్చుకొని డిషౌట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఇన్​స్టెంట్ జొన్న దోశ రెడీ.

ఇదీ చూడండి:ఆహారం కలుషితమైతే.. పేగు సంబంధిత వ్యాధులు తప్పువు!

ABOUT THE AUTHOR

...view details