మక్క అటుకుల కూర తయారీ విధానం..
కావాల్సినవి: మక్క అటుకులు- పావుకేజీ, ఆవాలు, జీలకర్ర- టీస్పూన్ చొప్పున, సన్నగా తరిగిన పచ్చిమిర్చి- నాలుగు, ఉల్లిపాయలు- రెండు, కరివేపాకు రెబ్బ- ఒకటి, ఉప్పు- తగినంత, ఉల్లికాడల ముక్కలు- కప్పు, పసుపు- అర టీస్పూన్, అల్లం పేస్టు- టీస్పూన్, ఎండుకొబ్బరి పొడి- రెండు టీస్పూన్లు, ధనియాల పొడి- టీస్పూన్, కొత్తిమీర తరుగు- కొద్దిగా.
తయారీ:మక్క అటుకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత మక్క అటుకులు, ధనియాలపొడి వేయాలి. తర్వాత కొబ్బరిపొడి చల్లి కలపాలి. నీళ్లు పోసి కూర దగ్గర పడేంతవరకు ఉడికించాలి. కొత్తిమీర తరుగు వేసి దించేయాలి.
ఇవీ చదవండి: