తెలంగాణ

telangana

ETV Bharat / priya

Kaddu Ki Kheer: హైదరాబాద్​ స్టైల్​లో​ 'కద్దూ కీ ఖీర్​'

కద్దూ కీ ఖీర్(Kaddu Ki Kheer)​... చాలామందికి పరిచయం ఉన్న వంటకం. దీనిని ఎక్కువమంది విని ఉంటారు తప్ప తిన్న వాళ్లు చాలా తక్కువ మంది. రెస్టారెంట్​కు వెళ్లినప్పుడు మెనూలో చివరగా ఉంటే చూసి ఆర్డర్​ చేస్తారు. అలాంటి ఈ స్వీట్​ను ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

Kaddu ki kheer
కద్దూ కీ ఖీర్​

By

Published : Sep 27, 2021, 4:16 PM IST

హైదరాబాద్​.. బిర్యానీకి ఎంత ఫేమస్సో, కద్దూ కీ ఖీర్​కు (Kaddu Ki Kheer) కూడా అంతే ఫేమస్​. రెస్టారెంట్​కు వెళ్లి ఇది తినకుండా వస్తే చాలామందికి ఏదో వెలితిగా ఉంటుంది. అలాంటి కద్దూ కీ ఖీర్​ను ఇంట్లో ఎలా తయారు చేయొచ్చో ఓసారి చూద్దాం.

కద్దూ కీ ఖీర్​ తయారీ విధానం..

ముందుగా ఓ పాన్​లో నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, చిదిమిన బాదంపప్పు, సొరకాయ తురుము వేయాలి. తరువాత అందులో పాలు పోయాలి. బాగా మరిగాక దానిలో సాబుదాన, నీటిలో కలిపిన క్లస్టర్​ పౌడర్​, కండెన్స్​డ్​ మిల్క్​, చక్కెర వేసి కొంచెం యాలకుల పొడి వేసి 5-10 నిమిషాలు చిన్న మంటతో ఉడికించుకోవాలి. దానిని ఓ బౌల్​లోకి తీసుకుంటే కద్దూ కా ఖీర్​ రెడీ.

కద్దూ కీ ఖీర్​ తయారీకి కావాల్సిన పదార్థాలు..

  • సొరకాయ
  • నెయ్యి
  • పాలు
  • సాబుదాన
  • సరిపడా నీళ్లు
  • క్లస్టర్​ పౌడర్​
  • కండెన్స్​డ్​ మిల్క్​
  • జీడిపప్పు
  • బాదం పప్పు
  • యాలకుల పొడి

ఇదీ చూడండి:Types Of Onion Cutting: ఉల్లిపాయలను ఇన్ని రకాలుగా కట్​ చేసుకోవచ్చా?

ABOUT THE AUTHOR

...view details