దక్షిణ భారత దేశంలో ఫేమస్ అల్పాహారం ఇడ్లీ. అయితే, ప్రాంతాన్ని బట్టి ఇడ్లీ చేసే తీరు మారుతుంది. దానితో పాటు రుచి, ఆకారం మారుతుంది. ఆవిరి మీద ఉడికే ఈ తెల్లని ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. అయితే దీని పిండి కలపడం చాలా మందికి ఓ సమస్యే. సరిగ్గా కలపకపోవడం వల్ల ఇడ్లీ ఆకారం, రుచి సరిగ్గా రాదు. ముఖ్యంగా పొంగినట్లు అస్సలు రాదు. మరి అందంగా పొంగినట్లు ఇడ్లీ రావాలంటే ఈ కింది విధంగా కలపాలి.
ఇడ్లీలు బాగా పొంగాలంటే ఇలా చేయండి!
ఇడ్లీ.. చాలా మంది ఎంతో ఇష్టంగా తినే అల్పాహారం. అయితే చాలా మందికి దీని పిండి సరిగ్గా కలపడం రాదు. దీంతో ఇడ్లీ ఆకారం, రుచి సరిగ్గా రాదు. కాబట్టి ఇవి చక్కగా పొంగినట్లు రావలంటే ఏం చేయాలంటే...
ఇడ్లీ
పిండి బాగా మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకున్నట్లైతే ఇడ్లీలు బాగా పొంగినట్లు వస్తాయి. ఉడకగానే బయటికి తీసినప్పుడు చూడటానికి చాలా అందంగానూ కనిపిస్తాయి. ఇక ఇడ్లీ ప్రియులు చూడగానే వీటిని లొట్టలేసుకుంటూ తినేస్తారు.
ఇదీ చూడండి: ఇలా చేస్తే ఇడ్లీ ఇష్టపడనివారూ తినేస్తారు!