How to Makes Methi Mutton Recipe :సండే వచ్చిందంటే చాలు.. చాలా మంది ప్లేట్లో మాంసాహారం ఉండాల్సిందే. మార్కెట్లో ఎన్నిరకాల నాన్ వెజ్ అందుబాటులో ఉన్నా.. కొందరు మటన్ అమితంగా ఇష్టపడతారు. అయితే.. మటన్ కర్రీ(Mutton Curry)ని నిత్యం ఒకేలా తిని బోర్ కొట్టిందా? అయితే ఈ ఆదివారం స్పెషల్ మెంతికూర మటన్‌ను ఓసారి ట్రై చేద్దాం.. మటన్‌తో మెంతికూర(Menthi Kura)ను జోడించి వండంతే సూపర్ టేస్ట్‌తోపాటు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మీ సొంతం. సో.. మెంతికూర మటన్ ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Required Ingredients for making Methi Mutton Curry :
మెంతికూర మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు :
- బోన్‌లెస్ మటన్- 500గ్రా(అరకేజీ)
- మెంతి- ఒకటిన్నర కప్పు
- టమాటాలు- మూడు
- ఉల్లిపాయ ముక్కలు- ఒకటిన్నర కప్పు
- యాలకులు- రెండు
- లవంగాలు- మూడు
- దాల్చినచెక్క- చిన్నముక్క
- షాజీర- పావుచెంచా
- గరంమసాలా- చెంచా
- ధనియాలపొడి- అరచెంచా
- నూనె- మూడు చెంచాలు
- కారం- తగినంత
- ఉప్పు- తగినంత
- పసుపు- సరిపడా
- పచ్చిమిర్చి- నాలుగు
- అల్లంవెల్లుల్లి పేస్ట్- చెంచాన్నర
How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!
మెంతికూర మటన్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Methi Mutton Making Process in Telugu :ముందుగా మటన్‌ని శుభ్రంగా కడిగి.. దానికి ఉప్పు, పసుపు, కారం పట్టించి ఓ అరగంటపాటు (మారినేట్) పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత స్టౌ వెలిగించి కడాయి పెట్టి పైన చెప్పుకున్న విధంగా నూనె పోసి అందులో దాల్చినచెక్క, యాలకులు, షాజీర, లవంగాలు వేసి తక్కువ మంట మీద వేడిచేశాక ఉల్లిపాయముక్కలు, మిర్చి, ఉప్పు వేసుకుని వాటిని కాసేపు దోరగా వేయించుకోవాలి.
అలా వేగాక.. ఆ మిశ్రమంలో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది పచ్చిన వాసన పోయాక దాంట్లో మెంతాకు వేసుకోవాలి. నీరు ఆవిరై, దగ్గరకు వచ్చేంతవరకూ దానిని ఉడికించి.. ఆ తర్వాత మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి మూతపెట్టి పదినిమిషాలు ఉడికించుకోవాలి. కూరలోని నీరంతాపోయి పొడిగా అయ్యాక ఒక కప్పు నీళ్లు పోసుకుని దానిని మెత్తగా ఉడకనివ్వాలి. ఇక చివరగా గరంమసాలా, ధనియాలపొడి వేసుకుంటే ఆహా నోరూరించే రుచికరమైన మేతి మటన్ రెడీ.
Methi Mutton Curry Health Benefits :ఇక ఈ టెస్టీ మేతి మటన్ కర్రీని తింటే ఎవరైనా ఆహా ఏమి రుచి ఆనాల్సిందే. అలాగే మెంతికూర కలిపి చేసిన మటన్ కర్రీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతికూరలో ఏ, సీ , ఈ విటమిన్లు, కెరోటిన్, క్యాల్షియం, ఐరన్, సోడియం, కాపర్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, సెలేనియం, మాంగనీస్, ప్రొటీన్లు విస్తారంగా ఉన్నాయి. దీనిని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే.. ఓన్లీ మెంతికూరను తినడానికి ఇష్టపడనివారు ఇలా మటన్‌తో ట్రై చేసి తింటే.. ఇటు టేస్ట్‌తోపాటు అటు ఆరోగ్యం అన్నమాట! మరి.. ఇంకేం..? ఈ సండే మేతి మటన్‌తో ఎంజాయ్ చేయండి..!
Sunday Special Non Veg Curries : సండే స్పెషల్.. నాటుకోడి కూర.. బోటీ మసాలా ఫ్రై.. ఇలా చేశారంటే.. బొక్కకూడా వదలరు
How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!