తెలంగాణ

telangana

ETV Bharat / priya

'దూద్​ పేడా'.. సులువుగా చేసుకోండిలా! - doodh peda calories

చాలా మంది(doodh peda home cooking) ఇష్టంగా తినే మిఠాయిల్లో దూద్​ పేడా ఒకటి. ఎంతో రుచిగా, తియ్యగా బాగుంటుంది. దీన్ని(doodh peda recipe) ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోండి.

doodh peda
దూద్​ పేడా

By

Published : Oct 4, 2021, 5:03 PM IST

దూద్​ పేడా(doodh peda home cooking).. ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్​ను తినడానికి చాలామంది ఇష్టపడతారు. దాదాపు మన పరిసరాల్లో ఉండే అన్ని పాల కేంద్రాలు సహా బేకరీల్లోనూ దొరుకుతుంది. పండగలప్పుడు ఇంట్లో చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ మిఠాయిని(doodh peda calories) సులభంగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

లీటరు పాలకు సరిపడా పదార్థాలు

చిక్కటి పాలు- లీటరు

60 గ్రాముల చక్కెర

100 గ్రాముల ప్లెయిన్​​ కోవా

కాస్తంత ఇలాచి పొడి

కొంచెం నెయ్యి

తయారీ విధానం

ముందుగా(doodh peda recipe) ఓ పాన్​లో ఒక లీటరు పాలు తీసుకుని అవి 150 ఎం.ఎల్​ అయ్యేవరకు మరిగించాలి. అలా మరిగించుకున్న పాలల్లో చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ప్లెయిన్​ కోవా, ఇలాచి పొడి వేసి మరోసారి బాగా కలుపుకొని దగ్గరగా ముద్దలా అయ్యేలా చేసుకోవాలి.

అనంతరం ఈ పేస్ట్​ను.. నెయ్యి రాసిన ప్లేట్​ మీద పరుచుకుని కాస్త చల్లగా అయ్యాక గుండ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే.. కమ్మని దూద్​పేడా రెడీ అవుతుంది. మనకి ఇష్టం ఉంటే ఈ స్వీట్​పై జీడిపప్పు లేదా బాదం పప్పుతో గార్నిష్​ చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: వంటింట్లో ఆ సమస్యా? అయితే ఇలా చేయండి..!

ABOUT THE AUTHOR

...view details