తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఈ ఆమ్లెట్​లో పోషకాలు ఫుల్​..! - టేస్టీ పన్నీర్ ఆమ్లెట్

ఆమ్లెట్ అనగానే నోరూరని వారుండరు. అయితే ఎప్పుడూ ఒకేరకమైన ఆమ్లెట్​ తిని బోర్ కొట్టిందా? అయితే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ ఆమ్లెట్​ను ట్రై చేయండి.

paneer omlet
పనీర్ ఆమ్లెట్​

By

Published : Aug 14, 2021, 4:45 PM IST

ఆమ్లెట్​ అంటే కేవలం బ్రెడ్​ ఆమ్లెట్ మాత్రమే కాదు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఆమ్లెట్​ను ఎప్పుడైనా తిన్నారా..​? మరికెందుకు ఆలస్యం ఇప్పుడే చేసుకోండి పన్నీర్ ఆమ్లెట్​..

కావాల్సిన పదార్థాలు

  • పన్నీర్
  • కోడిగుడ్డు
  • పసుపు
  • కారం
  • ఉప్పు
  • కొత్తిమీర
  • నూనె
  • టమాటో సాస్
  • రెడ్​చిల్లీ సాస్

తయరీ విధానం :

ముందుగా ఓ మిక్సింగ్ బౌల్​లో కోడిగుడ్డు సొన.. కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో పన్నీర్​ ఉంచి, కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్​లాగా వేసుకోవాలి. దానిపై కొత్తిమీర, టామాటో సాస్, రెడ్​చిల్లీ సాస్, కొద్దిగా నూనె వేయాలి.

మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన ఆమ్లెట్​ను ఒక సర్వింగ్​ ప్లేట్​లోకి తీసుకోవాలి. చిన్నచిన్న ముక్కలుగా పిల్లలకు పెట్టాలి.

ఇదీ చదవండి:నోరూరించే చికెన్​ ఆమ్లెట్​ తిన్నారా..!

ABOUT THE AUTHOR

...view details