జీర్ణక్రియ సమస్య 'షికంజి'తో మాయం షికంజి.. వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే పానీయం. వినడానికి పేరు కొత్తగా ఉన్నా.. తయారీ విధానం మాత్రం దాదాపు అందరికీ సుపరిచితమే. సాధారణంగా మనం చేసుకునే నిమ్మరసంలో కాస్త నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, సుగంధ ద్రవ్యాలను కలిపితే షికంజి రెడీ అయిపోతుంది.
కావలసిన పదార్థాలు...
నిమ్మకాయ, చక్కెర, జీలకర్ర పొడి, ఉప్పు
తయారీ విధానం...
ముందుగా ఒక నిమ్మకాయను రెండు సమ భాగాలుగా కోసి, రసాన్ని ఒక గ్లాసులో పిండుకోవాలి. ఈ రసంలో ఒక స్పూన్ చక్కెర, అర టీస్పూన్ జీలకర్ర పొడి, నల్ల ఉప్పు ఒక స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి నీళ్లు జోడించి బాగా కలపాలి. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవడమే!
వీడియోలో చూపినట్లుగా.. షికంజిని తయారు చేసుకుని.. మీ అభిప్రాయాన్ని ఈటీవీ భారత్తో పంచుకోండి.
ఇదీ చూడండి:వేసవిలో 'ఆమ్ కా పన్నా' తాగాల్సిందే!