పచ్చడి రుచిగా రావాలంటే నాణ్యమైన రొయ్యలను ఎంచుకోవాలి. పచ్చడికి పెద్ద రొయ్యలే బాగుంటాయి. చిన్నవి వద్దు. ముందుగా వీటిని బాగా శుభ్రం చేసి గిన్నెలో నీళ్లు పోసి మూతపెట్టి కాసేపు ఉడికించాలి. రొయ్యలు ఒకవంతు ఉడకగానే స్టవ్ ఆఫ్ చేయాలి. నీళ్లు పూర్తిగా పారబోసి రొయ్యలను తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే పచ్చడిలో వేశాక మరింత రుచిగా, మెత్తగా ఉంటాయి. మరో గిన్నెలో చింతపండు వేసి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.
మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలను నూనె లేకుండా వేయించి చల్లార్చుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు రొయల్ని నూనెలో వేయించాలి. ఈ పచ్చడికి వేరుసెనగ నూనె రుచిని ఇస్తుంది. సాధ్యమైనంత వరకు గానుగ నూనె వాడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దోరగా వేగిన రొయల్ని తీసి పక్కన పెట్టుకుని అదే నూనెలో అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి, రొయ్యలు, చింతపండు గుజ్జు ఒక దాని తర్వాత మరొకటి అన్ని నూనెలో కలిపితే పచ్చడి రెడీ.
ఇదీ చూడండి:సాయంత్రం క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారా.. జాగ్రత్త!