తెలంగాణ

telangana

ETV Bharat / priya

ప్రాన్స్ 65.. రుచిగా.. కరకరలాడుతూ.. - రొయ్యల ఫ్రై

ప్రతిసారి చికెన్ 65 తినీ తినీ బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త వెరైటీగా ప్రాన్స్ 65 ట్రై చేయండి. సింపుల్​గా వేగంగా చేయగలిగే ఈ రెసిపీని వర్షం పడుతున్నప్పుడు తింటే ఉంటుంది. మరెందుకు ఆలస్యం..

prawns
prawns

By

Published : Aug 30, 2021, 7:01 AM IST

సాధారణంగా రొయ్యలతో పులుసు చేయడం చాలామందికి తెలుసు. అయితే రొయ్యలతో కరకరలాడే ప్రాన్స్ 65ని చేసుకుని తినండి. ఇక వహ్వా అనకుండా ఉండలేరు. అంత రుచిగా ఉంటుంది మరి. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలంటే?

కావాల్సిన పదార్థాలు..

రొయ్యలు 250గ్రాములు,

బియ్యపిండి,
మైదాపిండి,
ఒక కోడిగుడ్డు,
కార్న్​ఫ్లోర్,
ధనియాలా పొడి,
జీలకర్ర పొడి,
మిరియాల పొడి,
అల్లంపేస్ట్,
నిమ్మకాయ ఒకటి,
గరం మసాలా,
కొత్తిమీర ఒక కట్ట,
ఉప్పు తగినంత.

తయారీ విధానం..

శుభ్రంగా కడిగిన 250గ్రాముల రొయ్యలను ఒక గిన్నెలో తీసుకోవాలి. దీనిపై ఒక కోడిగుడ్డు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బియ్యపుపిండి, మైదాపిండి, కార్న్​ఫ్లోర్, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, కారం, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కరివేపాకు, ఉప్పు, కాస్త కొత్తిమీర, కొన్ని నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మాసాల పట్టించిన రొయ్యలు అంటారు.

పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. మసాలా పట్టించిన రొయ్యలను బాగా వేడెక్కిన నూనెలో వేయాలి. రొయ్యలు బాగా ఫ్రై అయ్యేవరకు వేయించాలి. అదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి రోస్ట్ అవ్వగానే దించేయాలి. అంతే కరకరలాడే టేస్టీ ప్రాన్స్​ 65రెడీ..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details