Millet Cookies Recipe : చిన్న పిల్లలు కుకీలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మార్కెట్లో దొరికే చాలా వాటిలో ఎక్కువ మైదా పిండితో తయారు చేసినవే ఉంటాయి. వీటిని కొనడానికి కొద్దిమంది తల్లిదండ్రులు ఇష్టపడరు. అంతేకాకుండా ఇవి పిల్లల ఆరోగ్యానికి అంత మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే పిల్లల కోసం స్పెషల్‌గా చిరుధాన్యాలతో కుకీస్‌ను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
పోషకాల గని: మిల్లెట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్స్ ఉండడంతో పాటు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్‌గా ఇది పాపులర్. ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గ్లూటెన్ రహిత శాకాహారి ధాన్యంగా వీటిని చెప్పొచ్చు. ఇందులో ఫాస్పరస్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. కండరాల పనితీరుకు, డయాబెటిస్‌ను కంట్రోల్ ఉంచడం, జీర్ణప్రక్రియను మెరుగుపర్చడం.. ఇలా ఎన్నో రకాలుగా ఇవి ఉపయోగపడతాయి.. మరి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని అందించే మిల్లెట్ కుకీస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్లెట్ కుకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
- కొర్రలు-100 గ్రాములు
- సామలు-100 గ్రాములు
- వరుగులు-100 గ్రాములు
- బ్రౌన్ షుగర్-300 గ్రాములు(పొడి చేసుకోవాలి)
- మిల్క్ పౌడర్- 150 గ్రాములు
- బటర్-300 గ్రాములు
- చిటికెడు ఉప్పు
- నీళ్లు కొద్దిగా