తెలంగాణ

telangana

ETV Bharat / priya

How to Make Khubani Ka Meetha Telugu: ఖుబానీ కా మీఠా.. టేస్ట్​ అదుర్స్​.. ఐస్​క్రీమ్​తో తింటే ఆ మజానే వేరు..!

How to Make Khubani Ka Meetha Telugu: మీకు స్వీట్​ అంటే ఇష్టమా..? తొందరగా తయారు అయ్యే రెసిపీ గురించి ఆలోచిస్తున్నారా..? అయితే మీ కోసమే.. 'ఖుబానీ కా మీఠా'. మరి దీనికి కావాల్సిన పదార్థాలు..? తయారీ విధానం ఏంటో..? ఈ కథనంలో తెలుసుకుందాం..

How_to_Make_Khubani_Ka_Meetha
How_to_Make_Khubani_Ka_Meetha

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 7:59 AM IST

Updated : Sep 17, 2023, 9:39 AM IST

How to Make Khubani Ka Meetha Telugu:స్వీట్​ అంటే చాలా మందికి ఇష్టమే. బయట మార్కెట్​లో రకరకాల స్వీట్లు అందుబాటులో ఉన్నా ఇంట్లో చేసుకుంటే ఆ రుచే వేరు. అయితే చాలా మంది సింపుల్​గా తయ్యారయ్యే స్వీట్​ ఏంటో అని తెగ వెతికేస్తారు. మీకు ఆ శ్రమ లేకుండానే మేము ఓ వంటకం గురించి చెప్తున్నాం. అదే "ఖుబానీ కా మీఠా". ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో లాలాజలం ఊరిందా..?​ ఎందుకంటే.. ఇది చాలా ఫేమస్​. ముఖ్యంగా రెస్టారెంట్లు, పెళ్లిళ్లలో కూడా దీన్ని వడ్డిస్తారు. ఖుబానీ కా మీఠా అనేది ఒక ప్రసిద్ధ హైద్రాబాదీ స్వీట్​. దీనిని నేరేడు పండ్లతో తయారు చేస్తారు. నేరేడు పండ్లను ఆప్రికాట్​ అని కూడా పిలుస్తారు. ఈ స్వీట్​ తయారీ విధానం చాలా సింపుల్​గాఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఖుబానీ కా మీఠాకు కావాల్సిన పదార్థాలు..

Ingredients to Khubani Ka Meetha..

  • ఖుబానీ ( ఆప్రికాట్స్​)-200 గ్రాములు
  • పంచదార- 200 గ్రాములు
  • కేసర్​ రంగు-చిటికెడు(Optional)

ఖుబానీ కా మీఠా తయారీ విధానం..

How to Make Khubani Ka Meetha..

  • ముందుగా 200 గ్రాముల ఖుబానీ(గింజలు ఉన్న ఆప్రికాట్స్​) తీసుకోండి. ఇవి డ్రైఫ్రూట్స్​ అమ్మే షాపులో లేదంటే.. పెద్ద సూపర్​ మార్కెట్​లో దొరుకుతాయి.
  • ఖుబానీలో వేడి నీటిని పోసి.. సుమారు 6 లేదా 8 గంటలు నానబెట్టండి.
  • ఆ తర్వాత నానిన ఆప్రికాట్స్​లో నుంచి గింజలను తీసి పక్కకు పెట్టండి. ఈ గింజల్లో ఉన్న పప్పు బాదం పప్పును పోలి ఉంటుంది. టేస్ట్​ కూడా చాలా బాగుంటుంది. ఆప్రికాట్​ గింజలను పగులకొట్టి అందులో ఉన్న పప్పులను దంచి (క్రష్)​ పక్కన ఉంచండి.
  • ఇప్పుడు 200 గ్రాముల పంచదారను తీసుకోండి. ఆప్రికాట్స్​ ఎంత మోతాదులో తీసుకుంటే పంచదార కూడా అంతే తీసుకోవాలి. ఒకవేళ తీపి ఎక్కువ లేదా తక్కువ తినేవారు ఎంతకావాలో అంత వేసుకోవచ్చు.
  • తర్వాత ఈ పంచదారలో గింజలు తీసిన ఖుబానీని నీటితో సహా వేసుకోవాలి.
  • పంచదారను ఖుబానీని బాగా కలుపుకుని స్టవ్​ వెలిగించి సిమ్​లో పెట్టుకుని 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత ఓ చిటికెడు కేసర్​ రంగు వేసి కలుపుకోవాలి. ఇది వేయకపోతే మీకు మంచి కలర్​ రాదు. కలర్​ వద్దు అనుకుంటే వేసుకోనవసరం లేదు.
  • ఇప్పుడు బాగా కలుపుకుని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్​లో దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోని దించేసుకోవడమే.
  • చల్లారిన తర్వాత ఫ్రిజ్​లో ఉంచి.. ఓ గంట తర్వాత సర్వ్​ చేసుకుంటే టేస్ట్​ అదిరిపోద్ది.
  • సర్వ్​ చేసేముందు.. అంతకుముందే క్రష్​ చేసి ఉంచుకున్న ఖుబానీ గింజల్లోని పప్పును పైన చల్లుకుని తినేయడమే.
  • ఐస్​క్రీమ్​తో అయితే ఇంకా బాగుంటుంది.
Last Updated : Sep 17, 2023, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details