వర్షాకాలంలో పిల్లలు చిప్స్ అంటే భలే ఇష్టపడతారు. కానీ, చిప్స్ మాయలో పడి.. యాపిల్ వంటి ఆరోగ్యాన్నిచ్చే పండ్లు తిననేతినరు. ఇక వంటల రాజు వంకాయ.. కూరలో కనిపిస్తే తీసి అవతల వేస్తారు. అందుకే, వారికే తెలియకుండా... యాపిల్, వంకాయలలోని పోషకాలను అందిద్దామిలా...
యాపిల్ చిప్స్
కావల్సినవి:
- యాపిల్స్ - రెండు
- బ్రౌన్ షుగర్ - రెండు చెంచాలు
- దాల్చిన చెక్క పొడి - అరచెంచా
- వెన్న - రెండు చెంచాలు.
తయారీ:
యాపిల్స్ కడిగి, తుడిచి పల్చని స్లైసుల్లా కోయాలి. వీటికి మిగిలిన పదార్థాలన్నీ కలిపి 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో బేక్ చేసుకోవాలి. లేదంటే.. వెన్న వేసుకుంటూ పెనంమీద కాల్చుకోవాలి. ఈ చిప్స్‌ని గిలక్కొట్టిన క్రీంతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.