తెలంగాణ

telangana

నోరూరించే కజ్జికాయలు తిన్నారా..?

By

Published : Aug 13, 2021, 3:53 PM IST

కజ్జికాయలు ఈ పేరు వింటేనే నోరూరుతోందా? పండగల సమయంలో ప్రతి ఇంట్లో చేసుకునే పిండి వంటకం ఇది. మరి ఇప్పుడు శ్రావణ మాసం కదా.. నోరూరించే కజ్జికాయలు చేసుకోకపోతే ఎలా? ఇంకెందుకు ఆలస్యం మరి!

Kajjikayalu
కజ్జికాయలు

పండగ ఏదైనా తెలుగువారు ఎక్కువగా చేసుకునే పిండి వంటకం కజ్జికాయలు. మరి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి..

కావాల్సిన పదార్థాలు:

  • మైదాపిండి
  • బొంబాయి రవ్వ
  • నెయ్యి
  • ఉప్పు
  • నీళ్లు
  • ఎండు కొబ్బరి తురుము
  • గసగసాలు
  • యాలకుల పొడి
  • జీడిపప్పు
  • బెల్లం
  • పుట్నాల పొడి

తయారీ విధానం:

  • ఒక బౌల్​లో మూడొంతుల మైదాపిండి, ఒక వంతు బొంబాయి రవ్వ, ఒక వంతు నెయ్యి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి.
  • మరో పాత్రలో ఎండుకొబ్బరి పొడి, గసగసాల పొడి, యాలకుల పొడి, జీడిపప్పు, బెల్లం, పుట్నాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని చపాతీలా ఒత్తుకొని కజ్జికాయల అచ్చులో వేయాలి. కొబ్బరి మిశ్రమాన్ని దాంట్లో పెట్టి కజ్జికాయాల్లాగా ఒత్తుకోవాలి.
  • అలా తయారైన కజ్జికాయలను నూనెలో వేసుకుని.. తక్కువ మంటమీద వేయించి గోధుమ రంగులోకి మారగానే తీయాలి. అంతే నోరూరించే కజ్జికాయలు రెడీ అయినట్లే..

ABOUT THE AUTHOR

...view details