తెలంగాణ

telangana

ETV Bharat / priya

'ఫాల్సా కా షర్బత్​'తో అందం, ఆరోగ్యం మీ సొంతం! - Phalsa ka sharbat

లాక్​డౌన్​లో ఇంట్లోనే ఉండి వంటలు నేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? వెరైటీ వంటకాలు ఇష్టపడి, ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారైతే.. ఈ పానీయం ఓసారి ట్రై చేయండి. ఎందుకంటే పండ్లతో చేసిన ఈ షర్బత్​ తయారీకి తక్కువ సమయమే పడుతుంది. ఇది రుచితో పాటు, అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉత్తర భారత దేశంలో యమ ఫేమస్​ అయిన 'ఫాల్సా షర్బత్​' గురించి తెలుసుకుందామా?

how to make falsa ka sharbat at home learn in telugu
'ఫాల్సా కా షర్బత్​' ఒక్క సారి తాగితే.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

By

Published : Jun 17, 2020, 1:31 PM IST

తీయ తీయగా, పుల్లపుల్లగా ఉండే ఫాల్సా (గ్రెవియా ఆసియాటికా).. బెర్రీ జాతికి చెందిన ఫలం. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలను, గాయలను అత్యంత వేగంగా తగ్గించేస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు సహా డయాబెటిస్​, అధిక వేడి, డీహైడ్రేషన్​ ఇబ్బందులకు ఇది చెక్​ పెడుతుంది. ఇంకెందుకు ఆలస్యం 'ఫాల్సా కా షర్బత్​' రెసిపీ సింపుల్​గా చేసుకోండిలా..

'ఫాల్సా కా షర్బత్​' ఒక్క సారి తాగితే.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

కావలసినవి ఇవే..

ఫాల్సా-మూడు కప్పులు, నీళ్లు-తగినంత, చక్కెర-1 కప్పు, నల్ల ఉప్పు-2 టీ స్పూన్లు, పుదీనా-1 టీస్పూను, చల్లటి నీరు-500 మి.లీ, పుదీనా-ఓ చెంచాడు

తయారు చేయండిలా..

'ఫాల్సా కా షర్బత్​' ఒక్క సారి తాగితే.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

ఫాల్సా పండ్లలో తగినంత నీరు పోసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్​పై పాత్ర పెట్టి ఓ కప్పు నీటిలో చక్కెర వేసి పాకం తయారు చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఫాల్సా మిశ్రమాన్ని ఓ సర్వింగ్​ గ్లాసులో తీసుకుని, ఐస్​ క్యూబ్స్ వేసుకోవాలి. ఆ మిశ్రమంలో చక్కెర పాకాన్ని పోస్తూ కలపాలి. ఆపై నల్ల ఉప్పు, పుదీనా వేసుకొని చల్లటి నీరు పోసుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన ఫాల్సా షర్బత్​ సిద్ధమైనట్లే. అయితే ఫాల్సా లేకపోతే ఈ స్థానంలో ద్రాక్ష, నేరేడు, బ్లూబెర్రీ వంటి వాటితోనూ ప్రయత్నించొచ్చు. అయితే వాటిల్లోని గింజలు తొలగించుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం మీరూ తయారు చేసి, మీ అనుభూతిని ఈటీవీ భారత్​తో పంచుకోండి.

ఇదీ చదవండి:వేడి, కఫం తగ్గాలా?'పెసరపప్పు సలాడ్‌' చేసుకుని తినండి

ABOUT THE AUTHOR

...view details