సౌత్ ఇండియాలో దోశకు ఉన్నంత క్రేజ్ మరో బ్రేక్‌ఫాస్ట్‌కు లేదని చెప్పాలి! చాలామందికి దోశ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. అందుకే బయటకు వెళ్లినప్పుడు మెనూకార్డ్ తీసుకుంటే ముందుగా ఇచ్చే ఆర్డర్.. దోశే. అలాంటి దోశలు రుచికరంగా రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?
ఈ గింజలు కలిపితే.. దోశలు మరింత రుచికరం! - దోశ చిట్కాలు
దోశలు అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇందులో చాలా రకాల దోశలు ఉంటాయి. ఏ దోశలైనా రుచికరంగా, మృదువుగా వస్తే తినడానికి చాలా బాగుంటాయి. అయితే అలా రావాలంటే ఏం చేయాలంటే?

దోశ రుచికరంగా ఉండాలంటే ఏం కలపాలి
ముందుగా ఓ బౌల్ తీసుకోవాలి. అందులో దోశ తయారీకి వేసే బియ్యం, మినపప్పు, మెంతులును వేసుకోవాలి. వాటితో పాటు అదనంగా ముదిరిన ఆనపు గింజలను కూడా అందులో వేయాలి. ఎప్పటిలాగానే మిక్సీలో వేసుకుని.. మెత్తగా అయ్యాక.. ఓ పాత్రలో తీసుకోవాలి. ఆ పిండిని కొద్ది గంటల పాటు ఉంచి.. పొంగు వచ్చిన తరువాత దోశలు వేసుకుంటే చాలా రుచికరంగా, అంతేకాకుండా క్రిస్పీగా కూడా తయారవుతాయి.
ఇదీ చూడండి:ఈ దోశలు ఎప్పుడైనా టేస్ట్ చేశారా?