తెలంగాణ

telangana

ETV Bharat / priya

'గోరుచిక్కుడు'తో నయా రెసిపీ ట్రై చేయండిలా - etv bharat food

పిల్లలు గోరుచిక్కుడు(గోకరకాయ) చూస్తేనే చాలు.. మొహమంతా చిట్లించుకుంటారు. కానీ, గోరుచిక్కుడులో ఉండే ఫైబర్​ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి పిల్లలచేత గోరుచిక్కుడులోని పోషకాలను మీ కుటుంబానికి అందించాలనుకుంటే.. ఇలా గోరుచిక్కుడు రొట్టెలు చేసి పెట్టండి..​

how-to-make-cluster-beans-goru-chikkudu-slash-gokarkaya-roti-recipes-in-telugu
'గోరుచిక్కుడు'తో నయా రెసిపీ ట్రై చేయండిలా!

By

Published : Jun 29, 2020, 1:00 PM IST

గోరుచిక్కుడులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, ఎప్పుడూ ఒకేలా కూరలు వండితే పిల్లలు, పెద్దలు పెద్దగా ఇష్టపడరు... మరి వెరైటీగా గోరుచిక్కుడు రొట్టెలు తినిపించేయండి....

'గోరుచిక్కుడు' రొట్టెలు!!

కావలసినవి:

  • గోరుచిక్కుడు కాయలు: అర్ధపావు
  • బియ్యప్పిండి: 4 కప్పులు
  • ఉల్లిపాయలు: రెండు
  • పచ్చిమిర్చి: నాలుగు
  • కరివేపాకు తురుము: 2 టీ స్పూన్లు
  • కొత్తిమీర తురుము: 2 టీస్పూన్లు
  • జీలకర్ర: టీస్పూను
  • కారం: అరటీస్పూను
  • నూనె: 2 టీస్పూన్లు
  • ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం:

  • ముందుగా గోరుచిక్కుడు కాయల్ని ఉడికించి ఈనెలు తీయాలి.
  • ఓ గిన్నెలో బియ్యప్పిండి, గోరుచిక్కుడు కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కారం కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి ముద్దలా కలపాలి.
  • ఇప్పుడు పిండిముద్దను మనకు కావాల్సిన సైజులో తీసుకొని చేత్తోనే రొట్టెలా వత్తుకుని పెనంమీద నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. వీటిని ఏదైనా చట్నీ లేదా టొమాటో సాస్‌తో తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి.

ఇదీ చదవండి: చల్లగా వాన పడుతుంటే.. హెల్తీ చిప్స్ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details