How to Make Chicken 65 Recipe at Home in Telugu:సండే వచ్చిందంటే.. చాలా మందికి ముక్క కావాల్సిందే. ముక్క లేనిది.. ముద్ద దిగదంటారు. అయితే.. అందరికీ అందుబాటులో ఉండే నాన్‌వెజ్..చికెన్. కానీ.. ఆదివారం చికెన్ కొనేవారిలో మెజారిటీ జనం ప్రతిసారీ ఒకేరకమైన కర్రీ వండేస్తారు. కొత్త పద్ధతులు తెలియక చాలా మంది.. ఆలస్యం అవుతుందని మరికొందరు ప్రయోగాలకు దూరంగా ఉంటారు. కానీ.. కాస్త దృష్టిపెడితే రెస్టారెంట్ స్టైల్లో అద్భుతమైన చికెన్-65 ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
How to Prepare Hyderabadi Chicken Dum Biryani : సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!
చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు:
- చికెన్ ముక్కలు: అరకిలో,
- అల్లం వెల్లుల్లి పేస్టు: 2 టీస్పూన్లు,
- కారం: 2 టీస్పూన్లు,
- ధనియాల పొడి: 2 టీస్పూన్లు,
- జీలకర్రపొడి: 2 టీస్పూన్లు,
- కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి): టేబుల్‌స్పూన్,
- మైదా: 2 టేబుల్ స్పూన్లు,
- గుడ్డు: ఒకటి,
- ఆవాలు: టీస్పూన్,
- కచ్చాపచ్చాగా నూరిన మిరియాలు: టీ స్పూన్,
- ఎండుమిర్చి: రెండు,
- పచ్చిమిర్చి: నాలుగు
- కరివేపాకు: ఐదారు రెబ్బలు,
- ఉప్పు: తగినంత,
- సోడా: అరలీటరు,
- ఫుడ్ కలర్-చిటికెడు(రెడ్ కలర్)
- నూనె: వేయించడానికి సరిపడా
How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!
తయారు చేసే విధానం:
Chicken 65 Making Process at Home:
- ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి.
- తర్వాత సన్నగా పొడవాటి ముక్కలుగా కోసి పక్కకు పెట్టుకోవాలి.
- ఓ గిన్నె తీసుకుని.. చికెన్ ముక్కలు వేసుకోవాలి.
- ఆ ముక్కల్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా నూనె, ఫుడ్ కలర్ వేసి ముక్కలకు బాగా పట్టించి.. సుమారు ఓ గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మసాలా మిశ్రమం చికెన్ ముక్కలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది.
- తర్వాత విడిగా ఓ గిన్నె తీసుకొని.. అందులో గుడ్డు, మైదా, కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) వేసి బాగా బీట్ చేయాలి.
- ఆ మిశ్రమంలోనే సోడానీళ్లు పోసి బాగా కలిపి ఫ్రిజ్‌లో సుమారు పావు గంటసేపు ఉంచాలి.
- ఆ తర్వాత ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీయాలి.
- అనంతరం ఒక్కో చికెన్ ముక్కనీ సోడా మిశ్రమంలో ముంచి తీసి ఓ ప్లేటులో పెట్టాలి. చికెన్ ముక్కలను మొత్తం ఇలాగే చేయాలి.
- తర్వాత స్టౌ మీద కళాయి పెట్టి నూనె పోసి.. బాగా వేడి అయ్యాక ఒక్కో చికెన్ ముక్కనీ నూనెలో వేసి (పకోడి మాదిరిగా వేయాలి. ముక్కలు అంటుకోకుండా) వేయించుకోవాలి.
- ముక్కలు వేయించేటప్పుడు స్టౌ సిమ్‌లో పెట్టాలి. ముక్కలన్నీ పూర్తిగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత విడిగా ఓ పాన్ స్టౌ మీద పెట్టి.. అందులో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి(పొడవుగా కట్ చేసుకోవాలి) వేసి పోపు చేయాలి.
- ఆ తర్వాత ఆయిల్ నుంచి పోప్‌ను వేరు చేసి.. ఆ పోప్ మిశ్రమాన్ని చికెన్ ముక్కలమీద గార్నిష్ చేసుకోవాలి.
- అంతే.. ఎంతో టేస్టీగా.. జ్యూసీగా ఉండే చికెన్ 65 రెడీ.
- మరి ఇంకెందుకు ఆలస్యం..? మీరు కూడా ప్రిపేర్ చేయండి.. సండే రోజున ఈ రెస్టారెంట్ స్టైల్ రెసిపీని ఎంజాయ్ చేయండి.
Dasara Special Non Veg Recipes : దసరాకి మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. వావ్ అనాల్సిందే..!
Best Recipes For Navratri Fasting 2023 : నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా..? అయితే.. ఇవి తినండి!
Chicken Snacks Recipes : సండే స్పెషల్.. చికెన్ స్నాక్స్ చేసేద్దామా..?