తెలంగాణ

telangana

ETV Bharat / priya

పిల్లలు ఇష్టంగా తినే పాల అటుకులు.. చేసేయండిలా..

చిన్న వయసులో పిల్లలకు ఆహారం ఏం పెట్టాలో తెలియట్లేదా? మీరు పెట్టిన భోజనం తినట్లేదా? అయితే.. పిల్లలకు ఎంతో ఇష్టమైన, పోషకాలు ఉండే పాల అటుకులను ఇస్తూ ఉండండి. సులువుగా జీర్ణమయ్యే దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

how to make a favorite food for kids
పాల అటుకులు

By

Published : Oct 28, 2021, 2:51 PM IST

చిన్నపిల్లలు త్వరగా ఎదగాలంటే మంచి ఆహారం అందిస్తుండాలి. అయితే.. అందులో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవడమూ ముఖ్యమే. ఆటలాడే వయసులో పిల్లలు ఎక్కువ తింటుంటారు. అందులో ముఖ్యంగా రైస్​ ఉంటే ఇంకా మంచిది. కానీ ఎప్పుడూ అదే తింటూ ఉండలేరు కదా. అందుకే అల్పాహారంగా పిల్లలకు ఎంతో ఇష్టమైన పాల అటుకులను అందివ్వండి. చూడడానికి బాగుండి, రుచికరంగా ఉండే దీనిని చూడగానే పిల్లలకు నోరూరుతుంది. ఇందులో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.

ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

  • అటుకులు
  • బెల్లం
  • పాలు
  • నెయ్యి

తయారీ విధానం..

మొదట స్టవ్​ వెలిగించుకోవాలి. బాండీ పెట్టి ఒక స్పూన్​ నెయ్యి యాడ్​ చేయాలి. ఇది కరుగుతున్న సమయంలోనే అటుకులు వేయాలి. కొద్దిగా కలిపిన తర్వాత సరిపడా బెల్లం వేయాలి.

బెల్లం కొద్దిగా కరుగుతున్నప్పుడే అందులో పాలు పోయాలి. బెల్లం కరిగిపోయి అటుకులు మెత్తగా అయిపోయి.. పాలు కొద్దిగా మరిగినట్లు ఉంటే వెంటనే తీసేయాలి. 2 నిమిషాల తర్వాత సర్వ్​ చేసుకొని తినేయచ్చు.

ఇవీ చూడండి: Idli Recipe: బ్రేక్​ఫాస్ట్​గా లైట్ ఫుడ్​ కావాలా? రసం ఇడ్లీ ట్రై చేయండి

ఇడ్లీతో బర్గర్​.. సింపుల్​గా చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details