పాల నుంచి పెరుగు, వెన్న వచ్చినట్లుగా డైరెక్ట్‌గా నెయ్యి(Ghee) రాదు. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. నెయ్యి తయారీ వెనుక కొన్ని రోజుల ప్రక్రియ ఉంటుంది. పాలను వేడి చేసి.. పైన వచ్చి మీగడతో వెన్న తయారవుతుంది. ఆ వెన్నను బాగా వేడి చేస్తే నెయ్యి తయారవుతుంది. అయితే ఈ నెయ్యి కమ్మగా, సువాసన వచ్చేలా ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు.
కావాల్సినవి
వెన్న, తమలపాకులు (ఇవి యాడ్ చేస్తే కమ్మటి సువాసన వస్తుంది).
కమ్మని నెయ్యిని తయారు చేయండిలా..
ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెన్నని ఒక గిన్నెలో వేసి వేడి చేయాలి. కరిగిన తర్వాత పైన తెట్టె వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత అందులో 3 తమలపాకులు వేసుకొని మరి కాసేపు కాచుకోవాలి. పైన డార్క్బ్రౌన్ తెట్టే కట్టే వరకు కాచుకున్న తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. కాస్త చల్లారిన తర్వాత వడకట్టుకొని ఒక జాడిలోకి మార్చుకుంటే కమ్మని నెయ్యి తయారవుతుంది.
ఇదీ చూడండి:'రాగి బెల్లం దోశ'తో ఆరోగ్యం పదిలం!