తెలంగాణ

telangana

ETV Bharat / priya

'ఉలవల పొడి'తో కిడ్నీలో రాళ్లకు చెక్​ పెట్టండిలా! - ఉలవల పొడి తయారీ విధానం

ఉలవలు.. మూత్ర సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయని.. కిడ్నీలో రాళ్లను కరిగించే సామర్థ్యం వీటికి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటువంటి ఉలవలను పొడి చేసి ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. మరి ఆ పొడి ఎలా చేయాలంటే.

horse gram powder recipe
ఉలవల పొడి

By

Published : Sep 11, 2021, 4:00 PM IST

ఉల‌వ‌లు.. వీటి గురించి తెలియని వారుండ‌రు. వీటిలో ఉష్ణగుణం కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలు అందుతాయి. ఉలవలను వివిధ పద్ధతుల్లో ఆహారంగా తీసుకోవచ్చు. పొడిలా తయారు చేసి కూడా ఆహారంలో భాగంగా వీటిని తీనవచ్చు. మరి ఉలవల పొడి ఎలా తయారు చూద్దామా..?

కావాల్సినవి

ఉలవలు, నువ్వులు, శొంఠిపొడి, కొబ్బరిపొడి, సోంపు, బెల్లం

తయారీ విధానం

ముందుగా స్టవ్​ వెలిగించి పాన్​ పెట్టి 1 కప్పు ఉలవలు, వేసి వేయించాలి. రెండు స్పూన్లు నువ్వులు, సోంపు వేసి మరోసారి వేయించాలి. తర్వాత మిక్సీజార్​లోకి తీసుకుని అరకప్పు బెల్లం, ఒక స్పూన్ శొంఠి​ పొడి, 2 స్పూన్లు కొబ్బరిపొడి వేసి గ్రైండ్​ చేసుకోవాలి. ఇలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్​లోకి తీసుకుంటే ఉలవల పొడి రెడీ.

ఇదీ చూడండి:కొబ్బరిపాల పాయసాన్ని ఇలా చేశారంటే.. ఇక వదలరు!

ABOUT THE AUTHOR

...view details