తెలంగాణ

telangana

ETV Bharat / priya

బేక్​ చేయకుండా కేక్​ చేసుకోండిలా... - cakes recipe in telugu

ఇన్నాళ్లు.. ఏ సంతోషమొచ్చినా.. బేకరీకి వెళ్లి కేకులు తెచ్చుకుని కట్​ చేసేవాళ్లం. కానీ, ఈ కరోనా కాలంలో బేకరీలకు వెళ్లలేము.. వెళ్లినా వైరస్​ ఏ కేకుపై వాలిందోనన్న అనుమానంతో తినలేము. అందుకే, ఆ భయం లేకుండా.. ఇంట్లో దొరికే వస్తువులతోనే, ఓవెన్ లేకుండా ఎంతో ఈజీగా కేక్​ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి!

homemade cakes without oven and without east
బేక్​ చేయకుండా కేక్​ చేసుకోండిలా...!

By

Published : Jun 22, 2020, 1:00 PM IST

పుట్టినరోజు, చదువులో పాసైన రోజు, పెళ్లికుదిరిన రోజు, పెళ్లయ్యాక తల్లి కాబోతున్నారని తెలిసిన రోజు... ఇలా సందర్భం ఏదైనా సరే.. శుభవార్త అంటే నోరు తీపి చేయాల్సిందే. అప్పట్లో అంటే ఓ బెల్లం ముక్కో, పాయసమో చేసి సంతోషాలు పంచుకునేవారు. కానీ, ఇప్పుడు ఏ గుడ్​ న్యూస్​ అయినా... కేక్​ లేనిదే ఆ సంబరం పూర్తి కాదు. అందుకే, ఇంట్లోనే సింపుల్​గా కేకులు తయారు చేసుకుని.. ప్రేమను చాటే రెసిపీలు మీ కోసం..

ఈ కేకులు బేక్​ చేయక్కర్లేదు...

కేక్​ తయారు చేయడం ఓ కళ.. కానీ, బేకింగ్​లో అనుభవం లేకుంటే కేక్​ సరిగ్గా రాదు. అందుకే, బేకింగ్​ అవసరమే లేకుండా ఈ కేకులు తయారు చేయండిలా...

బిస్కెట్‌ కేక్‌

బిస్కెట్‌ కేక్‌

కావాల్సినవి

  • బిస్కెట్స్‌ - 200 గ్రాములు (అమ్మకు నచ్చినవి ఎంచుకోండి)
  • బటర్‌ - అరకప్పు
  • కొకోవా పౌడర్‌ - అరకప్పు

తయారీ

బిస్కెట్స్‌ను ముక్కలుగా కట్‌ చేసి బేకింగ్‌ ట్రేలో వేయాలి. ఇప్పుడు స్టౌ పై ఓ గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించాలి. ఇలా మరుగుతున్న గిన్నెపై మరో గిన్నె పెట్టి అందులో బటర్‌, కొకోవా పౌడర్‌ వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బిస్కెట్స్‌పై పోసి వాటికి బాగా పట్టేలా కలపాలి. చివరగా ఓ గిన్నెలో ఈ బిస్కెట్‌ మిశ్రమాన్ని సమాంతరంగా పరచాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిజ్‌లో 3-4 గంటలపాటు పెట్టి.. గట్టిపడే దాకా ఉంచితే సరి. యమ్మీ ‘బిస్కట్‌ కేక్‌’ రెడీ!

చాక్లెట్‌ మౌసీ కేక్‌..

చాక్లెట్‌ మౌసీ కేక్‌..

కావాల్సినవి

  • వెన్న తొలగించని పాలు - 500 మిల్లీ లీటర్లు
  • క్రీమ్‌ - 50 మిల్లీ లీటర్లు
  • కొకోవా పౌడర్‌ - 2 టేబుల్‌స్పూన్స్‌
  • మొక్కజొన్న పిండి - 2 టేబుల్‌స్పూన్స్‌
  • పంచదార - అరకప్పు
  • డార్క్‌ చాక్లెట్‌ - కప్పు

తయారీ..

ఒక పెద్ద బౌల్‌ తీసుకుని పాలు, క్రీమ్, కొకోవా పౌడర్‌, మొక్కజొన్న పిండి, పంచదార అన్నింటినీ వేసి కలపాలి. ఇప్పుడు ఈ బౌల్‌ను స్టౌపై పెట్టి 2-3 నిమిషాలు పాటు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చివరగా డార్క్‌ చాక్లెట్‌ను వేసి కరిగేంత వరకూ బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్‌ చేసి ఈ మిశ్రమాన్ని కేక్‌ మౌల్డ్‌లో పోసి చల్లారనివ్వాలి. ఆపై ఫ్రిజ్‌లో పెట్టి కేక్‌ గట్టిపడేంత వరకూ ఉంచాలి. చివరగా దాన్ని బయటకు తీసి కేక్‌పై కొకోవా పౌడర్‌ చల్లితే సరి.

చాక్లెట్‌ లావా కప్‌ కేక్‌..

చాక్లెట్‌ లావా కప్‌ కేక్‌..

కావాల్సినవి

  • బిస్కెట్స్‌ పొడి - 1 కప్పు
  • చాక్లెట్‌ సాస్‌ - 1 కప్పు

తయారీ

బిస్కెట్స్‌ పొడికి చాక్లెట్‌ సాస్‌ కలిపి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు టీ కప్‌ తీసుకుని దాని లోపలి భాగంలో బేకింగ్‌ షీట్‌ పరవాలి. మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని టీ కప్‌ లోపలి అడుగు భాగంలో మధ్యలో ఖాళీ ఉండేలా అద్దుకోవాలి. ఇప్పుడు ఆ ఖాళీలో చాక్లెట్‌ సాస్‌ పోయాలి. చివరగా పై భాగాన్ని ముందుగా తయారుచేసి పెట్టుకున్న బిస్కెట్స్‌ పిండితో మూసేయాలి. ఇప్పుడు ఈ మౌల్డ్‌ను జాగ్రత్తగా కప్‌ నుంచి వేరు చేయాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకుని.. ఫ్రిజ్‌లో 2 గంటల పాటు ఉంచాలి. అంతే.. నోరూరించే చాక్లెట్‌ లావా కేక్‌ సిద్ధం.

నో బేక్​ ఛీజ్​ కేక్

నో బేక్​ ఛీజ్​ కేక్

కావలసినవి

క్రన్ట్​ కోసం..

  • పొడి చేసిన డైజెస్టివ్​ కుకీస్-ఒకటిన్నర కప్పు
  • కరిగించిన బటర్​-4 టేబుల్​ స్పూన్లు

ఛీజ్​ కేక్​ కోసం..

  • క్రీం ఛీజ్​ -అరకిలో
  • చక్కెర పొడి-ఒకటిన్నర కప్పు
  • వివ్​ క్రీం-3 కప్పులు
  • వెనీలా ఎసెన్స్ -ఒక టీ స్పూను

తయారీ

  • ఒక బౌల్​లో కుకీస్​ పొడి, బటర్​ వేసి కలపాలి. దీన్ని స్ప్రింగ్​ ఫామ్​ ప్యాన్​(అడుగు భాగం వరకు వేరు చేసేందుకు వీలయ్యే ప్యాన్​) అడుగున చల్లి వత్తుకోవాలి. దీన్ని ఓ పది నిమిషాలు ఫ్రిడ్జ్​లో పెట్టుకోవాలి.
  • మరో బౌల్​లో క్రీం ఛీజ్​ను స్మూత్​గా బేక్ చేసుకోవాలి. దీనికి అరకప్పు చొప్పున చెక్కర పొడి వేస్తూ కలుపుకోవాలి. చివరిగా వెనీలా ఎసెన్స్​ వేసుకోవాలి.
  • ఇందులో వివ్​ క్రీంని వేసి, ఫోల్డింగ్​ పద్ధతిలో కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ముందుగా కుకీస్ పొడి చల్లుకున్న ప్యాన్​లో పోయాలి. బుడగలు లేకుండా ప్యాన్​ను నెమ్మదిగా తట్టి పైభాగాన్ని సమానంగా పరచాలి.
  • ప్యాన్​ను ప్లాస్టిక్ వ్రాప్​తో చుట్టి కేక్​ను పూర్తిగా కవర్​ చేయాలి.
  • దీన్ని 12 గంటలపాటు ఫ్రిడ్జ్​లో ఉంచి, తర్వాత 3 గంటల పాటు ఫ్రీజర్​లోకి మార్చాలి.
  • ఫ్రీజ్​ చేయడం పూర్తయ్యాక... పది నిమిషాలు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచితే.. నోరూరించే చల్లని ఛీజ్​ కేక్​ సిద్ధం.

ఇదీ చదవండి:రోజుకో బ్రేక్​ఫాస్ట్​.. సింపుల్​గా చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details