తెలంగాణ

telangana

ETV Bharat / priya

Biryani Recipe: నోరూరించే నవాబీ బిర్యానీ చేసేద్దామా!

వీకెండ్​ అంటే బయట తిరిగే ప్లాన్లు ఉంటాయి. అలా వెళ్లినప్పుడు బిర్యానీని తినడం షరా మామూలే. మరి ఇంట్లో ఉండే వారి పరిస్థితి ఏంటి? ప్రతి వారాంతం లాగా కాకుండా జస్ట్ ఫర్​ ఏ ఛేంజ్​ మన చేతులతో మనమే వెజ్​ బిర్యానీని చేసుకొని తింటే ఎలా ఉంటుంది?

nawabi biryani telugu recipe
నవాబీ బిర్యానీ

By

Published : Sep 18, 2021, 7:00 AM IST

చాలామంది వీకెండ్​ ప్లాన్స్​లో వంట తయారు చేయడం కచ్చితంగా పెట్టుకుంటారు. వారం అంతా కష్టపడి.. వారాంతాల్లో నచ్చింది చేసుకొని తింటే ఆ మజానే వేరు. అలాంటి వారికి సింపుల్​గా బెస్ట్​ అండ్​ టేస్టీ ఫుడ్​.. నవాబీ వెజ్​ బిర్యానీ. దీన్ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి..

కావాల్సిన పదార్థాలు

  • బంగాళాదుంపలు
  • క్యారెట్​
  • బీన్స్​
  • క్యాలీఫ్లవర్​
  • ఉల్లిపాయలు
  • గ్రీన్​ పీస్​ బఠానీలు
  • కసూరీ మేతి
  • బ్రౌన్​ ఆనియన్స్​
  • పచ్చిమిర్చి
  • నిమ్మకాయ
  • ఫ్రెష్​ క్రీమ్
  • సరిపడినంత పెరుగు
  • బాస్మతి బియ్యం

తయారీ విధానం

ముందుగా ఓ బాండీలో నీళ్లు, ఉప్పు, షాజీర, లవంగాలు, ఇలాచీ, మరాఠీ మెగ్గ వేసి నీళ్లు వేసి బాగా మరిగించాలి. అందులో బాస్మతి బియ్యం వేసి 80 శాతం వరకు ఉడకనివ్వాలి. తరువాత ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసుకొని అందులో ఇలాచీ లవంగాలు, దాల్చిన చెక్క, షాజీర, బిర్యానీ ఆకు, సన్నగా పొడుగ్గా కట్​ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమేర, పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కట్​ చేసిన పెట్టుకున్న బంగాళాదుంప, క్యారెట్​ ముక్కలు, బీన్స్​ ముక్కలు, కాలీఫ్లవర్​, బఠానీలు, వేసి కలుపుకోవాలి. వాటిని ఐదు నుంచి పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి, పెరుగు, కారం, కసూరిమేతి వేసి కలుపుకొని మూతపట్టి బాగా ఉడకనివ్వాలి. అందులో ఫ్రెష్​ క్రీమ్, నిమ్మరసం వేసి కలుపుకొని పై నుంచి 80 శాతం ఉడికించిన బాస్మతి అన్నం వేసి.. అందులో నెయ్యి వేయాలి. కొంత సేపటికి డ్రైప్రూట్స్​, కుంకుమపువ్వు వేసి మూతపెట్టి 10 నిమిషాలు దమ్​ చేసుకొని ఒ పాత్రలోకి సర్వ్​ చేసుకొని పై నుంచి బ్రౌన్​ ఆనియన్స్​తో గార్నిష్​ చేసుకుంటే నవాబీ వెజ్​ బిర్యానీ రెడీ అవుతుంది.

ఇదీ చూడండి:సండే స్పెషల్​ 'మండీ' బిర్యానీని ఇంట్లో చేసుకోండిలా.

ABOUT THE AUTHOR

...view details