తెలంగాణ

telangana

ETV Bharat / priya

Mysore Pak Recipe: ఇంట్లోనే సింపుల్​గా మైసూర్​పాక్​ తయారీ! - నేతితో మైసూర్​పాక్​ ఎలా తయారు చేస్తారు

ఓ నాడు మైసూర్​ మహారాజ్​ కోసం చేసిన ప్రత్యేక వంటకాల్లో ఒకటైన మైసూర్​పాక్ (Mysore Pak Recipe)​ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. దీని పేరు తెలియని స్వీట్​ లవర్స్​ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎక్కువగా షాపుల్లో మాత్రమే కనపడే ఈ స్వీట్​ను చాలా సింపుల్​గా ఇంట్లోనే.. ఓ సాయంత్రం ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు. .

mysore pak
మైసూర్​ పాక్​

By

Published : Sep 20, 2021, 4:00 PM IST

దక్షిణ భారత దేశంలో పుట్టి.. దేశ వ్యాప్తంగా ఉండే ప్రతి స్వీట్​షాప్​లో దర్శనం ఇచ్చే ఏకైక తినుబండారం మైసూర్​పాక్ (Mysore Pak Recipe)​. చూడగానే నోటిలో నీళ్లు ఊరిస్తుంది. దీనిని నాలుకపై పెట్టుకోగానే ఆ రుచికి మ్మ్​... అని ఆస్వాదిస్తూ తినని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి స్వీట్​ను ఇంట్లోనే చాలా సింపుల్​గా ఎలా తయారు చేసుకోవాలో ఓ సారి చూద్దాం.

మైసూర్​ పాక్​ తయారీకి కావాల్సిన పదార్థాలు..

  • నీళ్లు
  • పంచదార
  • నెయ్యి
  • శెనగపిండి
  • యాలకలపొడి
  • పసుపు

తయారీ విధానం..

ముందుగా ఒక బాండల్​లో కొద్దిగా నీటిని తీసుకోవాలి. దానిలో పంచదార కలపాలి. దీనిని ఒక కప్పు నీటికి రెండు కప్పుల పంచదార అన్నట్లుగా తీసుకోవాలి. లేతపాకం వచ్చే వరకు వేడి చేయాలి. ఆ తరువాత మరో పాత్రలో సరిపడినంత నెయ్యి తీసుకోవాలి. దానిని వేడి చేయాలి. అందులో మనకు కావాల్సిన పరిణామంలో శెనగపిండిని తీసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా ముద్దగా ఏర్పడిన దానిని ముందుగా వేడి చేసుకున్న పాకంలో కలుపుకోవాలి. దానిలో నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ..దగ్గరగా వచ్చే వరకు కలపాలి. దానిలోనే పసుపు, యాలకల పొడి వేయాలి. దానిని మంచిగా పైకి, కిందకు కలపాలి. అలా కొంచెం గట్టిపడిన మిశ్రమాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి. దానిపై పంచదారా చల్లి.. గోరు వెచ్చగా ఉండగానే మనకు సరిపడినంత సైజ్​లో ముక్కలు ముక్కలుగా కట్​ చేసుకుంటే మైసూర్​పాక్​ రెడీ.

ఇదీ చూడండి:చవితి నైవేద్యాలు: గణనాథునికి ఇష్టమైన పూర్ణం బూరెలు!

ABOUT THE AUTHOR

...view details