తెలంగాణ

telangana

ETV Bharat / priya

రుచితో మనసు నింపే 'సలాడ్‌ నిక్వా' రెసిపీ! - etv bharat priya

ఆరోగ్యం పెంచే సలాడ్.. నోరూరిస్తే ఎలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది... అచ్చం సలాడ్ నిక్వాలా ఉంటుంది. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచే సలాడ్ నిక్వా రెసిపీ చూసేయండి మరి....

healthy and tasty salad niqua recipe
రుచితో మనసు నింపే 'సలాడ్‌ నిక్వా' రెసిపీ!

By

Published : Sep 26, 2020, 1:00 PM IST

పోషకాలు పుష్కలంగా నిండిన సలాడ్ నిక్వా... ఆరోగ్యంతో కడుపు నింపడమే కాదు రుచితో మనసునూ నింపేస్తుంది. అందుకే ఒక్కసారైనా నిక్వా సలాడ్ ట్రై చేయాల్సిందే..

కావల్సినవి

లెట్యూస్‌ ఆకులు- రెండు, టమాటా- ఒకటి, ఫ్రెంచ్‌బీన్స్‌ - ఆరు, ఉడికించిన కోడిగుడ్డు, ఉడికించిన బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున (ముక్కల్లా తరగాలి), ఉల్లిపాయ - ఒకటి, థైమ్‌ - కొద్దిగా, వెనిగర్‌ - చెంచా, ఆలివ్‌నూనె- రెండు చెంచాలు, ట్యూనా చేప - ఒకటి, ఆలివ్‌లు- పది, ఉప్పు- రుచికి తగినంత

తయారీ

ఆలివ్‌నూనె, వెనిగర్‌, థైమ్‌, తగినంత ఉప్పు తీసుకుని సలాడ్‌ డ్రెసింగ్‌ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఓ పాత్రలో లెట్యూస్‌ ఆకులు పరిచి టమాటా ముక్కలు, ఫ్రెంచ్‌బీన్స్‌, ముక్కల్లా తరిగిన బంగాళదుంప, ఆలివ్‌లు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కోడిగుడ్డు, చేప ముక్కలు తీసుకుని అన్నింటినీ పరిచి.. పైన సలాడ్‌ డ్రెసింగ్‌ వేయాలి. అంతే నోరూరించే ఫ్రెంచ్‌ సలాడ్‌ సిద్ధం.

ఇదీ చదవండి: పంచదారతో కాదు ప్రేమతో చుట్టేయండి 'లడ్డూలు'

ABOUT THE AUTHOR

...view details