తెలంగాణ

telangana

ETV Bharat / priya

అమ్మ చేతి 'డ్రైఫ్రూట్స్‌ లడ్డు'.. ఆరోగ్యానికి వెరీగుడ్డు - etv bharat food

కొందరు చిన్నారులు డ్రైఫ్రూట్స్‌ అస్సలు ఇష్టపడరు. అలాంటి చిన్నారుల చేత వాటిని తినిపించాలంటే ఒకే ఒక్క మార్గం లడ్డూనే. అయితే, కరోనా కాలంలో బయటి నుంచి తెచ్చుకోవడం కంటే అమ్మ చేతి లడ్డూలను తింటేనే పోషకాలు పుష్కలంగా అందుతాయి. మరింకెందుకు ఆలస్యం రెసిపీ చూసేద్దాం రండి...

healthy and easy dry fruits laddu recipe in telugu
అమ్మ చేతి 'డ్రైఫ్రూట్స్‌ లడ్డు'.. ఆరోగ్యానికి వెరీగుడ్డు!

By

Published : Sep 19, 2020, 1:25 PM IST

డ్రైఫ్రూట్స్ లడ్డూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చేసుకోవడం మాత్రం ఎంతో ఈజీ....

కావల్సినవి

యాభై గ్రాముల చొప్పున బాదం, కాజు, పిస్తా, వాల్‌నట్స్‌, కిస్‌మిస్‌, అంజీరా, ఖర్జూరం, నెయ్యి - అర కప్పు, యాలకుల పొడి - పెద్ద చెంచా.

తయారీ

మొదట పొయ్యి మీద పాన్‌ పెట్టి చెంచా నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో బాదం, కాజు, పిస్తా, వాల్‌నట్స్‌ వేసి వేయించాలి. ఆ తరువాత వాటిని మిక్సీలోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో మరోసారి చెంచా నెయ్యి వేసి కిస్‌మిస్‌, అంజీరా, ఖర్జూరం వేయించుకోవాలి. వీటిని కూడా మిక్సీ పట్టాలి. ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరువాత మిగిలిన నెయ్యి, యాలకుల పొడి వేసి ఉండల్లా చేసుకోవాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్‌ లడ్డూలు రెడీ.

ఇదీ చదవండి: గణనాథుడికీ ఇమ్యూనిటీ పెంచే రెసిపీస్!

ABOUT THE AUTHOR

...view details