తెలంగాణ

telangana

ETV Bharat / priya

హెల్దీ 'క్రీం సలాడ్' ట్రై చేద్దాం డ్యూడ్! - etv bharat food

ఆరోగ్యం కోసం ప్రతి రోజు సలాడ్ తినాలంటారు వైద్యులు. కానీ, పచ్చి కూరగాయలు, పండ్లు తిని బతికేయడానికి మనమేమైనా సాధువులమా అంటారు చాలా మంది. అందుకే, సలాడ్​ను రుచికరంగా.. ఎవ్వరైనా ఇష్టంగా తినేసేలా మార్చేద్దాం. క్రీం సలాడ్ రెసిపీ ట్రై చేద్దాం రండి..

healthy-and-easy-cream-salad-recipe-at-home
హెల్దీ 'క్రీం సలాడ్' ట్రై చేద్దాం డ్యూడ్!

By

Published : Sep 8, 2020, 1:00 PM IST

సలాడ్ తింటే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది. అందుకే, ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడూ ఇలా కాస్త వెరైటీగా సలాడ్ తయారు చేసుకంటే... ఇంటిల్లిపాది ఆనందంగా ఆస్వాదించొచ్చు.

కావాల్సినవి

యాపిల్‌, అరటిపండు, పైనాపిల్‌ - ఒక్కోటి చొప్పున, తాక్రీం - ఒకటిన్నర కప్పు, వెన్న - రెండున్నర చెంచాలు, మైదా - నాలుగు చెంచాలు, పాలు - మూడు టేబుల్‌స్పూన్లు, పంచదార - అరకప్పు, ఉప్పు - చిటికెడు, వంటసోడా - చిటికెడు, అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ - తగినన్ని.

హెల్దీ 'క్రీం సలాడ్' ట్రై చేద్దాం డ్యూడ్!

తయారీ

ఓ పాత్రలో క్రీం, వెన్న, మైదా తీసుకుని మెత్తని పిండి అయ్యేదాకా కలపాలి. ఇందులో ఉప్పు, పంచదార, వంటసోడా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పండ్లముక్కలు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు, పాలు వేసి ఫ్రిజ్‌లో ఉంచేయాలి. కొద్దిగా చల్లగా అయ్యాక తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఇదీ చదవండి : నోరూరించే 'ఎగ్ సలాడ్‌'తో ఆరోగ్యం దరిచేరుతుంది!

ABOUT THE AUTHOR

...view details