తెలంగాణ

telangana

ETV Bharat / priya

చక్కెర తింటున్నారా?.. జాగ్రత్త! - sugars

తీపి తినడం ఆరోగ్యానికి ఏ రకంగానూ మంచిది కాదనేది తెలిసిందే. అతిగా కాకుండా అప్పుడప్పుడూ తీసుకుంటే పెద్దగా సమస్య ఉండదులె అనుకుంటాం. కానీ స్వీట్స్‌ను తగు మోతాదులో తీసుకున్నా కాలేయంలో కొవ్వు పదార్థాలు పేరుకుంటాయనీ దీర్ఘకాలంలో అది జీవక్రియను ప్రభావితం చేస్తుందనీ జ్యురిచ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు.

jurich univercity
జ్యురిచ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు

By

Published : Apr 4, 2021, 2:54 PM IST

దీనికోసం ఆరోగ్యంగా ఉన్న వంద మందిని ఎంపిక చేసి మరీ పరిశీలించి చూశారట. మిగిలిన వాళ్లతో పోలిస్తే సుక్రోజ్‌, గ్లూకోజ్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకున్నవాళ్లలో జీవక్రియా వేగం తగ్గడంతో పాటు కాలేయంలో కొవ్వు కణాల శాతం ఎక్కువైనట్లు గుర్తించారు. ఈ పరిశోధన ఆధారంగా- రోజుకి 80 గ్రా. చక్కెర లేదా 0.8 లీటర్ల శీతల పానీయం తీసుకుంటే కాలేయంలో కొవ్వు కణాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందనీ అదలానే కొనసాగితే దీర్ఘకాలంలో ప్రమాదకరంగా పరిణమిస్తుందనీ వివరిస్తున్నారు సదరు పరిశోధకులు. కాబట్టి చక్కెర పదార్థాలతో జాగ్రత్త.

ABOUT THE AUTHOR

...view details