అల్లాన్ని శ్రింగిభేరం అనీ, ఆర్ద్రకం అనీ పిలుస్తారు. వాడుకభాషలో అద్రక్ అంటారు. అల్లంలోని ఘాటైన సుగంధ తైలాలు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆహారం వల్ల జీర్ణ వ్యవస్థకు వచ్చే ఇబ్బందులని తగ్గిస్తాయి. అల్లానికి రక్తంలో కొవ్వును తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి.
చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు అల్లం లేదా శొంఠిరసాన్ని ఇస్తే జలుబు తగ్గుతుంది. జలుబు రావడానికి కారణమైన రైనోవైరస్‌ను అదుపుచేసే శక్తి, అల్లానికి ఉండటమే ఇందుకు కారణం.
పోషకాలు: 100 గ్రాముల అల్లంలో 11గ్రా పిండి పదార్థాలు, 2.5గ్రా కొవ్వు పదార్థాలు ఉంటాయి. క్యాల్షియం 21 గ్రా. ఉంటుంది. ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
టీని ఎక్కువగా తాగేవాళ్లు.. రెండు నుంచి ఐదు గ్రాముల పచ్చి అల్లాన్ని దంచి టీలో కలిపి ఉడికించుకుని తాగితే టీవల్ల వచ్చే పైత్యం తగ్గుతుంది. అల్లంరసంలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.