బంగాళాదుంప తింటే లావవుతామనుకుంటారు చాలా మంది. కానీ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే పోషక విలువలు (Potato Health Benefits) శరీరానికి మంచి చేస్తాయని చెప్తున్నారు. అయితే దీనిని తీసుకునే విధానంలో కొంచెం మార్పు ఉంటుంది. అది ఫాలో అయితే ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్తున్నారు.
బంగాళాదుంపలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్లోనూ రెండు రకాలు ఉంటాయి. ఒకటి సాలిబుల్ ఫైబర్, రెండు ఇన్సాలిబుల్ ఫైబర్. ఇది ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహం వ్యాధి ఉన్న వారు కూడా దీనిని తీసుకోవచ్చు. చాలా మందికి ఓ అపోహ ఉంటుంది. దుంపకూరలను మధుమేహం ఉన్న వారు ఎక్కువగా తీసుకోకూడదని... నిజానికి అలాంటి ఏం లేదు. బంగాళాదుంపను భేషుగ్గా తీసుకోవచ్చు.