గోంగూర(gongura leaves)ను ఇష్టపడనివాళ్లు దాదాపుగా ఉండరు! దీన్ని విడిగానే కాదు, వేరే కూరగాయలతో కలిపి వండినా నోరూరిపోతుంది. ఇంకా డిఫరెంట్గా చేయాలంటే 'గోంగూర అన్నం' ట్రై చేయండి. రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పసందైన గోంగూర అన్నం ఎలా చేయాలో చూద్దాం(gongura annam tayari vidhanam).
కావాల్సిన పదార్థాలు (అన్నీ తగిన మోతాదులో తీసుకోండి)
గోంగూర, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, శనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, నెయ్యి.
తయారీ విధానం
ముందుగా కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. అందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, శనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి పోపు చేసుకోవాలి. ఇందులో ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూర, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించుకున్న అన్నం, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం సన్నగా తరిమిన ఉల్లిపాయలు వేసి కలుపుకొంటే ఎంతో రుచికరమైన గోంగూర అన్నం రెడీ.