జలుబు, శ్వాస సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని తీసుకోవడం మేలు. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే అమైనో యాసిడ్‌కి ఔషధ గుణాలు ఎక్కువ. ఆస్తమా బాధితులు వెల్లుల్లి రెబ్బలను ఉడికించి పాలతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
*ఈ కాలంలో ఆహార పదార్థాలు వేగంగా జీర్ణమవ్వడానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి, సెలీనియం, క్వర్సెటైన్ వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
*ఒత్తిడితో బాధపడేవారు ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మేలు. రక్తనాళాల పని తీరును మెరుగు పరిచే శక్తి వెల్లుల్లికి ఉంది. అధికరక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్స్ వంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు.
Health tip: వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోండి.. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి! - health tips in telugu
చిన్న సమస్య వస్తే చాలు యాంటీ బయోటిక్స్ వేసుకుంటారు చాలామంది. కానీ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో చూద్దాం.
వెల్లుల్లితో ఆరోగ్యం