తెలంగాణ

telangana

ETV Bharat / priya

దిల్ ఖుష్ చేసే 'దమ్‌ కా చికెన్‌' రెసిపీ! - dum ka chicken hyderabadi recipe

దమ్ కా బిర్యానీ తిన్నాం కానీ.. 'దమ్‌ కా చికెన్‌' ఏంటీ అనుకుంటున్నారా? అదే మరి, మొఘలాయిల పాకశాలలో ఇలాంటి ప్రయోగాలెన్నో జరిగాయి. ఆ నాటి మొఘలాయి దమ్ కా చికెన్ రుచిని అచ్చుగుద్దినట్లు ఆస్వాదించాలంటే ఇలా చేసుకోవాల్సిందే...

dum-ka-chicken-hyderabadi-recipe
దిల్ ఖుష్ చేసే 'దమ్‌ కా చికెన్‌' రెసిపీ!

By

Published : Sep 29, 2020, 1:00 PM IST

'దమ్‌ కా చికెన్‌' రుచికి ఎన్ని రెస్టారెంట్ రెసిపీలైనా దిగదుడుపే. మరి ఆ 'దమ్‌ కా చికెన్‌' ఎలా వండితే పర్ ఫెక్ట్ గా కుదురుతుందో చూసేయండి..

కావల్సినవి

చికెన్‌ - కేజీ, ధనియాలపొడి - టేబుల్‌స్పూను, జీలకర్ర పొడి - అరచెంచా, షాజీరా - అరచెంచా, దాల్చినచెక్క - మూడు చిన్న ముక్కలు, యాలకులు - నాలుగు, లవంగాలు - ఐదు, కారం - టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి ముద్ద - టేబుల్‌స్పూను, పెరుగు - కప్పు, వేయించిన ఉల్లిపాయముక్కలు - అరకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా, జీడిపప్పు, చిరోంజీ - టేబుల్‌స్పూను చొప్పున, పసుపు - పావుచెంచా, ఉప్పు - తగినంత, పుదీనా, కొత్తిమీర - సగం కట్ట చొప్పున, నిమ్మరసం - టేబుల్‌స్పూను, నూనె - అరకప్పు, గోధుమపిండి ముద్ద - చిన్న బంతి పరిమాణంలో.

తయారీ

ముందుగా షాజీరా, దాల్చినచెక్కా, యాలకులూ, లవంగాలు పొడిలా చేసుకుని పెట్టుకోవాలి. అలాగే చిరోంజీ, జీడిపప్పును ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని తీసుకుని అందులో చికెన్‌, జీడిపప్పు ముద్దా, అల్లంవెల్లుల్లి ముద్దా, వేయించిన ఉల్లిపాయముక్కలూ, పెరుగూ, పచ్చిమిర్చి ముద్దా, కారం, లవంగాలపొడి, జీలకర్రపొడీ, ధనియాలపొడీ, పసుపూ, తగినంత ఉప్పూ, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, నూనె వేసి కలిపి మూత పెట్టేయాలి. రెండు గంటల తరవాత ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి.. గోధుమపిండి ముద్దతో మూత అంచుల్ని మూసేయాలి. పదిహేను నిమిషాల తరవాత ఈ గిన్నెను పెనంమీద ఉంచాలి. ఇరవై నిమిషాల తరవాత దింపేసి పిండి తీసేస్తే చాలు. ఇది రోటీల్లోకే కాదు.. అన్నంలోకీ బాగుంటుంది.

ఇదీ చదవండి: వేడి వేడి 'ఎరాచీ పిడి' ఒక్కసారి రుచి చూడండి..

ABOUT THE AUTHOR

...view details