తెలంగాణ

telangana

ETV Bharat / priya

Dragon Chicken Recipe: రెస్టారెంట్​ స్టైల్​లో డ్రాగన్​ చికెన్​.. ట్రై చేయండి! - డ్రాగన్​ చికెన్​ తయారీకి కావాల్సిన పదార్థాలు

చికెన్​తో బిర్యానీ, ఇతరత్రా వంటలు చేసుకుని ఉంటారు. కానీ చికెన్​తో స్నాక్స్ ఐటం డ్రాగన్ చికెన్​ (Dragon Chicken Recipe) చేసుకుంటే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఆలస్యం.. ఈ రెసిపీ చేసేసుకోండి.

dragon chicken
డ్రాగన్​ చికెన్​

By

Published : Oct 24, 2021, 11:41 AM IST

సన్​డే అంటే ఫన్​డే. వారానికి దొరికే ఈ ఒక్కరోజును మనసుకు నచ్చినట్లు ఎంజాయ్​ చేయాలని చాలా మందికి ఉంటుంది. మంచి రుచిగా ఉండే వంటలతో సంతృప్తిగా తినాలని కోరుకుంటారు. మరి ఈ ఆదివారం చికెన్​తో స్నాక్స్ వంటకం అయిన డ్రాగన్​ చికెన్ (Dragon Chicken Recipe) ​చేసేసుకోండి.

డ్రాగన్​ చికెన్​కు కావాల్సిన పదార్థాలు....

  • చికెన్​
  • కోడి గుడ్డు
  • మైదా
  • కార్న్​ప్లోర్​
  • చిల్లీపేస్ట్​
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్​
  • మిరియాల పొడి
  • సోయాసాస్​
  • జీడిపప్పు
  • ఎండుమిర్చి
  • క్యాప్సికం ముక్కలు
  • ఉల్లిపాయ ముక్కలు
  • ఉప్పు సరిపడా
  • స్ర్పింగ్​ ఆనియన్స్​
  • టమాటో కెచప్​

డ్రాగన్​ చికెన్​ తయారీ విధానం...

ఒక బౌల్​లో చికెన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్​, చిల్లీ పేస్ట్​, సోయాసాస్​, మిరియాలపొడి, కోడి గుడ్డు వేసి కలిపి.. మైదా పిండి, కార్న్​ప్లోర్​ను వేసి ముద్దగా కలపాలి. వేడి నూనెలో వేసి పక్కన పెట్టాలి. తరువాత వేరే బాండల్​లో నూనె వేసి అది వేడి అయిన తరువాత.. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, జీడి పప్పు, క్యాప్సికం ముక్కలు, సోయాసాస్​, చిల్లీ పేస్ట్​, టమాటో కెచప్​, ఎండు మిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఫ్రై చేసుకున్న చికెన్​ను అందులో వేసి కలిపి... స్ర్పింగ్​ ఆనియన్స్​ ముక్కలు వేసి సర్వింగ్​ బౌల్​లోకి తీసుకుంటే డ్రాగన్​ చికెన్​ రెడీ.

ఇదీ చూడండి:ఆంధ్రా స్పెషల్.. 'ఉలవచారు కోడి కూర'

ABOUT THE AUTHOR

...view details