దమ్ బిర్యానీ హోటల్లోలాగే ఇంట్లోనూ చేయాలనుకుంటారు. కానీ బిర్యానీ అన్నం ముద్దగా మారుతుందని కొందరు చెబుతుంటారు. దీనివల్ల బిర్యానీ టేస్టు సరిగా ఉండక.. నిరుత్సాహానికి గురవుతుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే ఈ సూచనలు పాటించండి. ముఖ్యంగా దమ్ బిర్యానీ రుచిగా రావాలంటే బాస్మతీ బియ్యం, మాంసం సమానంగా వాడాలి.
సూచనలు:పాత బాస్మతీ బియ్యం వాడాలి. కొత్త బియ్యం వాడితే త్వరగా ఉడికి.. ఆవిరి మీద ఉడికించినప్పుడు ముద్దగా అవుతుంది. బియ్యాన్ని అరగంట నానబెట్టుకోవాలి. వీటిని ఉప్పు కలిపిన నీళ్లలో ఉడికించుకోవాలి. బియ్యం ముప్పావు వంతు ఉడకగానే నీరు వంపేసి పక్కకు పెట్టాలి. కుర్మా కూరను ముందే చేసుకోవాలి.
సువాసన రావాలంటే..