తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఇదెక్కడి 'దోశ'రా బాబు.. డిటర్జెంట్​​ తప్ప అన్నీ వేశాడు! - weird food

దక్షిణాదిలో అత్యంత ప్రీతికరమైన బ్రేక్​ఫాస్ట్ దోశ. వీటిలో ఉల్లి దోశ, ఉప్మా దోశ, మసాలా దోశ, పనీర్​ దోశ, బటర్​ దోశ అనే పేర్లు ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ, ఇటీవలే సోషల్​ మీడియాలో ఓ వెరైటీ దోశ వీడియో వైరల్​గా మారింది. అయితే ఈ దోశకు ఏ పేరు పెట్టాలో తెలియక నెటిజన్లు వ్యంగంగా కామెంట్స్​ చేస్తున్నారు. ఇంతకీ ఆ దోశ ఏంటో? దాన్ని ఏఏ పదార్థాలతో తయారు చేశారో తెలుసా?

Desi Twitter Can't Stomach This Dosa With Dry Fruit, Cheese
డిటర్జెంట్​​ తప్ప.. దోశలో అన్నీ వేశాడు!

By

Published : Sep 6, 2021, 5:19 PM IST

సోషల్​ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ట్రెండ్​ అవుతూ ఉంటాయి. అందులోనూ వంట వీడియోలంటే మరీనూ! కొత్త వంటకం ఏదైనా వస్తే.. దాన్ని ఎలా తయారు చేశారు? దాని రుచి ఎలా ఉందనే దానిపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరగడం షరామామూలే. అయితే ఇప్పుడు నెట్టింట ఓ దోశ మేకింగ్​ వీడియో వైరల్​గా మారింది.

ఈ దోశ తయారు చేసిన వ్యక్తి.. జీడిపప్పు, ఎండుద్రాక్షతో పాటు చెర్రీ, కిస్​మిస్​లను దోశపై పరిచాడు. వీటితో పాటు అనేక రకాల పదార్థాలను దోశపై వేయడం చూసిన నెటిజన్లు.. డిటర్జెంట్​ పౌడర్​ తప్ప మిగిలినవన్నీ వేశాడని చమత్కారంగా కామెంట్స్​ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు దీనికి చీజ్​ దోశ అని నామకరణం చేయగా.. మరికొందరు దీన్ని 'పాన్ ​కేక్​' అంటున్నారు.

"దోశ అనేది భారతదేశంలో అత్యంత దుర్వినియోగమైన వంటకం. నిజానికి సాధారణ దోశ చాలా రుచిగా ఉంటుంది. దాన్ని తినేందుకు ఒక చట్నీ సరిపోతుంది. అయితే దాన్ని తినేందుకు సాంబార్​, ఇతర చట్నీల అవసరమే లేదు. కానీ, కొందరు ఇలా దోశపై తమ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు" అంటూ ఓ నెటిజన్​ ట్వీట్​ చేశాడు.

ఇదీ చూడండి..వామ్మో​.. ఈ చికెన్​ ఎగ్​ రోల్​ ఎంత పెద్దదో!

ABOUT THE AUTHOR

...view details