తలస్నానం చేసేందుకు షాంపూ వాడతాం కదా.. ఈసారి అందులో ఈ పదార్థాలను కలిపి చూడండి. తలకు సంబంధించిన కొన్ని సమస్యల్ని చాలా సులువుగా అదుపులో ఉంచుకోవచ్చు.
- తల దురదగా ఉందా.. మీ షాంపూలో చిన్న మూత రోజ్‌వాటర్‌ని కలిపి వాడుకుని చూడండి. మార్పు కనిపిస్తుంది.
- మీరు వాడే షాంపూలో కాస్త నిమ్మరసం వేస్తే గనుక నిర్జీవంగా ఉన్న జుట్టు నిగనిగలాడుతుంది.
- జుట్టుకు తేమ అంది.. ఆరోగ్యంగా కనిపించాలంటే షాంపూలో కొద్దిగా తేనె కలపాలి.
- విపరీతంగా జుట్టు రాలుతోందా. కొన్ని చుక్కలు ఏదయినా అరోమా నూనెను మీ షాంపూలో కలిపి చూడండి. ఆ సమస్య అదుపులోకి రావడంతోపాటూ.. జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది.
- కలబందను షాంపూతో కలిపి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
- ఉసిరి రసం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య చాలా వరకూ తగ్గుతుంది.