తెలంగాణ

telangana

ETV Bharat / priya

సీతాఫల్​ ఖీర్​ - టేస్ట్​ చేస్తే వహ్వా అనాల్సిందే! - sitaphal milk shake in telugu

Custard Apple Recipes in Telugu: సీతాఫలం.. పేరు వింటేనే నోరూరుద్ది. మరి దానితో చేసే వంటకాలు.. ఇక చెప్పక్కర్లేదు. అదేంటి సీతాఫలాలతో వంటలు కూడా చేసుకోవచ్చా..? అని అనుమానం వచ్చిందా. మీ డౌట్​ నిజమే. కస్టర్డ్​ యాపిల్​తో నోరూరించే వంటలు చేసుకోవచ్చు. మరి ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

Custard Apple Recipes in Telugu
Custard Apple Recipes in Telugu

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 4:17 PM IST

Custard Apple Kheer and Milk Shake Making Process in Telugu :ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. సాధారణంగా ఈ పండ్లు సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య ఎక్కువగా లభిస్తాయి. ఎంతో రుచికరంగా ఉండే సీతాఫలాలు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎ, సి, బి6 వంటి విటమిన్లతో పాటు కాపర్, పొటాషియం, పీచు.. వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పైగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది కూడా. వీటిని మామూలుగా తినడం అందరికీ తెలిసిందే. కానీ.. స్వీట్స్ చేసుకోవచ్చనే విషయం మాత్రం అందరికీ తెలియదు. ఇక్కడ మీకోసం.. రెండు రకాల రెసిపీలను పరిచయం చేస్తున్నాం. అవే సీతాఫల్​ ఖీర్​, సీతాఫల్​ మిల్క్​షేక్​. మరి వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే!

సీతాఫల్​ ఖీర్ (Custard Apple Kheer)

కావలసిన పదార్థాలు:

  • చిక్కటి పాలు- 1 లీటరు
  • సీతాఫలం గుజ్జు- 1 కప్పు(గింజలు తీసినది)
  • చక్కెర-3 టేబుల్​ స్పూన్లు
  • జీడిపప్పు-2 టేబుల్​ స్పూన్లు
  • కిస్మిస్​-1 టేబుల్​ స్పూన్​
  • పచ్చికోవా-50 గ్రాములు(పంచదార కలపనిది)
  • యాలకుల పొడి-1 టీ స్పూన్​

How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్.. టేస్ట్ చేస్తే.. జిందగీ ఖుష్ అనాల్సిందే!

సీతాఫలం ఖీర్ రెసిపీ - తయారీ విధానం

  • ముందుగా స్టౌ ఆన్​ చేసి.. ఒక మందపు గిన్నెలో పాలు పోసి అవి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి.
  • తర్వాత అందులో రెండు టేబుల్​ స్పూన్ల​ జీడిపప్పు, ఒక టేబుల్​ స్పూన్​ ఎండు ద్రాక్ష వేసి పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత మరుగుతున్న పాలల్లో 50 గ్రాములు పచ్చికోవా, మూడు టేబుల్​ స్పూన్ల పంచదార వేసి (తీపి సరిపోకపోతే మరికొంచెం కలుపుకోవచ్చు) కోవా కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి.
  • కోవా కరిగిన తర్వాత ఓ కప్పు సీతాఫలం గుజ్జు, ఓ టీ స్పూన్​ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • అనంతరం ఖీర్​ దగ్గర పడ్డ తర్వాత దింపుకుంటే సరి. సీతాఫల్​ ఖీర్ రెడీ.
  • ఈ పాయసాన్ని వేడిగా తినొచ్చు లేదంటే ఫ్రిజ్​లో పెట్టుకుని కూడా తినొచ్చు.. రెండు రకాలుగా దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

How to Prepare Hyderabadi Chicken Dum Biryani : సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!

సీతాఫలం మిల్క్​ షేక్(Custard Apple Milk Shake)

కావాల్సిన పదార్థాలు:

  • పండిన సీతాఫలాలు-2
  • చిక్కని పాలు-1 కప్పు
  • షుగర్​-2 టేబుల్​ స్పూన్లు(తేనె కూడా వాడొచ్చు)
  • జీడిపప్పు-5
  • బాదం-5

Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!

తయారీ విధానం:

  • ముందుగా సీతాఫలాల్లో గింజలు తీసి గుజ్జును ఓ బౌల్​లో వేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకుని.. సీతాఫలాల గుజ్జు, పంచదార, పాలు, జీడిపప్పు, బాదంపప్పు వేసి మెత్తగా బ్లెండ్​ చేయాలి.
  • తర్వాత సర్వింగ్​ గ్లాస్​ల్లోకి సర్వ్​ చేసుకోవాలి.
  • మిల్క్​షేక్​ పైన డ్రై ఫ్రూట్స్​ తురుము, సీతాఫలం గుజ్జు కూడా వేసుకుని తాగవచ్చు.

How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!

ABOUT THE AUTHOR

...view details