తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఆహా! అనిపించే 'ఆలూ మ‌సాలా ఫ్రై' - Potato Masala fry

బంగాళాదుంపలతో ఎప్పుడూ చేసుకునే వెరైటీలు కాకుండా కాస్త కొత్తగా ప్రయత్నిస్తే.. నోరూరించే అద్భుతమైన వంటకాలు చేసుకోవచ్చు. అదెలాగంటారా? ఇదిగో మీరే ట్రై చేయండిలా..

POTATO MASALA CURRY
బంగాళ‌దుంప మ‌సాలా ఫ్రై

By

Published : Nov 25, 2020, 1:00 PM IST

పొటాటో వెడ్జెస్​ను రెస్టారెంట్లలో రుచి చూసే ఉంటాం. కానీ, ఇంట్లోనే ట్రై చేస్తే ఆ రుచే వేరు. ఘుమఘుమలాడే బంగాళాదుంప మసాలా ఫ్రై మనమే చేసుకోవచ్చు. ఇదిగో తయారీ విధానం మీకోసం..

కావల్సినవి:

  • బంగాళాదుంపలు పెద్దవి - ఆరు
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాబేజీ, క్యాప్సికం ముక్కలు - అరకప్పు చొప్పున
  • పనీర్‌ తురుము - అరకప్పు
  • కొత్తిమీర తరుగు - పావుకప్పు
  • ఉప్పు - తగినంత
    నూనె - వేయించేందుకు సరిపడా
  • పసుపు - కొద్దిగా
  • సెనగపిండి - మూడు చెంచాలు
  • కొబ్బరి తురుము - పావుకప్పు
  • పచ్చిమిర్చి - పది

తయారీ విధానం

బంగాళాదుంప ముక్కల్ని రెండుగా చేసుకుని మధ్యలో గుండ్రంగా వచ్చేలా లోపలి భాగాన్ని తీసేయాలి. ఇలా చేసుకున్న వాటిని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో రెండు మూడు చెంచాల నూనె వేడిచేసి ఉల్లిపాయ, క్యాబేజీ, క్యాప్సికం ముక్కలు వేయాలి. వాటిలోని పచ్చివాసన పోయి కాస్త మెత్తగా అయ్యాక పనీర్‌ తురుము, తగినంత ఉప్పు, పసుపు, సెనగపిండి, కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇది కూరలా తయారయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమాన్ని బంగాళాదుంపల్లో కూరి, వాటిని వెడల్పాటి బాణాలిలో ఉంచి నూనె వేస్తూ ఎర్రగా వేయించి తీసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు అలంకరిస్తే చాలు.

ఇదీ చదవండి:ఇంట్లోనే 'నూడుల్స్‌ కట్‌లెట్‌' ట్రై చేయండిలా..

ABOUT THE AUTHOR

...view details