తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2020, 1:29 PM IST

ETV Bharat / priya

ఆహా! అనిపించే 'గోంగూర రొయ్యల కూర'

గోంగూర పచ్చడి.. పుంటికూర పప్పు. రొయ్యల కూర.. వేపుడు.. పులుసు. ఎప్పుడూ ఇవేనా.? వేటికవే భిన్నమైన పోషకాలిచ్చే వాటితో మరిన్ని వెరైటీస్​ కూడా చేస్కోవచ్చు. గోంగూర, రొయ్యల్ని కలిపి వండేస్తే.. ఆ రుచే వేరు. అదెలా అంటారా.?. ఇదిగో తయారీ విధానం మీకోసం..

COOKING ASPARAGUS PRAWNS VARIETY IN NON VEG ITEMS
ఆహా! అనిపించే 'గోంగూర రొయ్యల కూర'

ఆకుకూరల్లో గోంగూర ప్రత్యేకం. ఎలా వండినా సరే.. పుంటికూర రుచే రుచి. దానికి రొయ్యల్ని కలిపితే.. ఇక ఆహా! అంటూ మైమరిచిపోవాల్సిందే.

కావల్సినవి:

  • గోంగూర - కప్పు
  • రొయ్యలు - రెండు కప్పులు
  • పిండి వడియాలు - కప్పు
  • నూనె - వేయించేందుకు సరిపడా
  • పచ్చిమిర్చి - రెండు
  • ఉల్లిపాయ ముద్ద - పావుకప్పు
  • ఉప్పు - తగినంత
  • కారం - ఒకటిన్నర చెంచా
  • వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
  • జీలకర్ర, ఆవాలు - అరచెంచా చొప్పున
  • అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా

తయారీ విధానం:

ముందుగా బాణలిలో అరకప్పు నూనె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది వేడయ్యాక వడియాలు వేయించుకుని తీసి పెట్టుకోవాలి. రొయ్యల్ని శుభ్రం చేసి వాటికి అల్లం వెల్లుల్లి పేస్టూ, కొద్దిగా కారం, ఉప్పూ పట్టించి పెట్టుకోవాలి. వడియాలు వేయించిన బాణలిలోనే ఇంకాస్త నూనె వేసి రొయ్యల్ని వేయించి తీసుకోవాలి. కాసేపటికి అవి మెత్తగా అవుతాయి. అప్పుడు దింపేయాలి. మరో బాణలిలో రెండు చెంచాల నూనె వేడి చేసి వెల్లుల్లి రెబ్బలూ, జీలకర్రా, ఆవాలూ, కరివేపాకు రెబ్బలూ, ఉల్లిపాయ ముద్దా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్దలోని పచ్చివాసన పోయాక వేయించుకున్న రొయ్యలూ, గోంగూర వేసేయాలి. తరువాత అరకప్పు నీళ్లూ, తగినంత ఉప్పూ, మిగిలిన కారం వేసి మంట తగ్గించాలి. గోంగూర పూర్తిగా మగ్గి.. కూరలా తయారయ్యాక ముందుగా వేయించుకున్న వడియాలు వేసి ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి.

ఇదీ చదవండి:ఆహా! అనిపించే 'తోటకూర చికెన్​'

ABOUT THE AUTHOR

...view details