Chukkakura Chicken Making Process :కేవలం ఆకుకూరలు వండుకుని తినాలంటే కష్టం కానీ.. వాటికి సరైన నాన్‌వెజ్ జోడీ దొరికితే ఆహా రుచి అదిరిపోతుంది! అయితే ఆకుకూరలతో నాన్‌వెజ్ అంటే అందరికీ.. గోంగూర, మెంతికూర మాత్రమే గుర్తొస్తాయి. కానీ.. ఇంకా చాలానే ఉన్నాయి. అందులో రెండు రెసిపీలను ఇవాళ ప్రయత్నిద్దాం.
చుక్కకూర చికెన్:నాన్ వెజ్ ప్రియులకు చికెన్ మంచి ఫేవరెట్ డిష్. ఎలా వండినా.. టేస్ట్ అదిరిపోతుంది. అయితే.. చాలా మంది ప్రయోగాలు చేయకుండా.. ప్రతిసారీ ఒకేలా కుక్ చేసుకుంటారు. దీనివల్ల డిఫరెంట్ ఫ్లేవర్‌ను టేస్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారు. మీరు కూడా రెగ్యులర్‌గా ఒకేవిధంగా చికెన్ వండుకుంటున్నట్టయితే.. ఈసారి మేము చెప్పే విధంగా ప్లాన్ చేయండి.
రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!
కావాల్సిన పదార్థాలు:
- చికెన్- అరకేజీ,
- చుక్కకూర- నాలుగు కప్పులు,
- పచ్చిమిర్చి- మూడు,
- అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు చెంచాలు
- నూనె- ఐదు చిన్న చెంచాలు,
- కారం- ఒకటిన్నర చెంచా,
- ఉప్పు- తగినంత,
- పసుపు- పావుచెంచా,
- ఉల్లిపాయ- ఒకటి,
- ధనియాలపొడి- ఒకటిన్నర చెంచా,
- గరంమసాలా- చెంచా,
- కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు
Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!
తయారీ విధానం:
- ముందుగా చికెన్ ముక్కలను మీడియం సైజ్‌లో కట్ చేసుకోవాలి.
- తర్వాత ఓ గిన్నె తీసుకుని అందులో చికెన్, ఓ చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఓ చెంచా ఉప్పు పట్టించి సుమారు అరగంటపాటు పక్కన పెట్టేయాలి.
- తర్వాత స్టౌపై కడాయి పెట్టి వేడెక్కాక నూనె పోసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి.
- తర్వాత మరో చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకుని.. మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి అందులోని నీరంతా పోయేంతవరకూ ఉడికించుకోవాలి.
- ఇప్పుడు కప్పున్నర నీళ్లు పోసి, ఉడుకుతున్నప్పుడు చుక్కకూర వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
- తర్వాత ధనియాలపొడి, గరంమసాలా, తగినంత ఉప్పు వేసుకోని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
- చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే చుక్కకూర చికెన్ రెడీ!
How to Prepare Methi Mutton Curry : మటన్ ఎప్పుడూ ఒకేలా ఏం తింటారు..? ఈ సండే ఇలా ట్రై చేయండి!